Man held for posting sister in law's morphed photos on facebook

Man posted morphed pictures of sister in law arrested

mumbai, mumbai police, unni krishnah, kerala, gulf countries, profile, photos on facebook, parties with friends, social media, sarees, facebook, western style dressing, sister in law, crime

A Young man is sent behing the bars by mumbai police after he confessed posting of his sister in law's morphed photos on facebook.

వదినకు బుద్ది చెప్పాలనుకుని.. కటకటాల్లోకి..

Posted: 07/28/2016 11:47 AM IST
Man posted morphed pictures of sister in law arrested

సామాజిక మాధ్యమం ద్వారా తన వదినకు బుద్ది చెప్పాలనుకున్న అమె మరదిని ముంబై పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. భారతీయ సంప్రదాయానికి విలువనిచ్చే వారు నానాటికీ పెరుగుతూ పోగా, పాశ్చాత సంస్కృతి వైపు అకర్షితులవుతన్నా వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఫేస్‌బుక్‌ను సద్వినియోగం చేసుకునే వారికంటే దుర్వినియోగం చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రెండు సంస్కృతుల మధ్య వున్న వత్యాసాన్ని తెలియజేయాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న యువకుడు చివరకు శ్రీకృష్ణ జన్మస్థానంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

నిత్యం పాశ్చాత ధోరణిలో డ్రెసింగ్ చేసుకునే తన వదినకు ముంబైలో నివాసమంటున్న ఓ కుర్రాడు బుద్ధిచెప్పాలనుకున్నాడు. అందుకు సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ను వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని అలోచన మంచిదే అయినా.. అతను తప్పుడు మార్గాన్ని అనుసరించడంతో పోలీసులు అరదండాలు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకు చెందిన ఓ యువతికి 2014 డిసెంబర్‌లో పెళ్లయింది. ఆమె భర్త గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె అప్పుడప్పుడు కేరళలోని అత్తమామల దగ్గరకు వెళ్లొస్తుండేది. ఆ క్రమంలోనే ఉన్నికృష్ణన్ ఆమెను చూశాడు. ఉన్నికృష్ణన్ బాబాయ్ కొడుకునే ఆమె వివాహం చేసుకుంది.
 
సాంప్రదాయాలకు విలువనిచ్చే ఉన్నికృష్ణన్‌కు ఆమె డ్రస్సింగ్ స్టైల్ నచ్చలేదు. చీరకట్టుకోకుండా చుడీదార్‌లు ధరించడం అతనికి నచ్చలేదు. ఆమె తిరిగి ముంబై వెళ్లిన తర్వాత ఆమెకు ఉన్నికృష్ణన్ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. తెలిసిన కుర్రాడు కావడంతో ఆమె అతని రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన అతనికి ఆమెపై అసహ్య భావం మరింత పెరిగింది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న యువతి కావడంతో ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలను, పార్టీ ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేసేది. ఆ ఫోటోలు చూసిన కృష్ణన్ తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు.
 
ఆమె ఫేస్‌బుక్‌‌ నుంచి ఫోటోలను సేవ్ చేసుకుని ఎడిట్ చేసి డ్రస్సింగ్‌ తీరును తప్పుబడుతూ ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్‌లు పెట్టేవాడు. తన ఫ్రెండ్స్ అందరికీ పోస్ట్ చేసేవాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్రెండ్ విషయం చెప్పడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు పోలీసులు కేసును ట్రేస్ చేసి ఉన్నికృష్ణన్‌ను నిందితుడిగా తేల్చారు. తన వదినకు గుణపాఠం చెప్పాలనే ఇలా చేశానని అతను విచారణలో ఒప్పుకున్నాడు. ముంబైలోని బందప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai  mumbai police  unni krishnah  facebook  western style dressing  sister in law  crime  

Other Articles