హిల్లరీ క్లింటన్ అన్ని విధాల అర్హురాలు అంటున్న ఒబామా | Obama slams Trump and makes appeal for Hillary Clinton

Obama slams trump and makes appeal for hillary clinton

Obama at philadelphia Convention, Obama DNC speech, Obama about Hillari Clintom, Obama slams Trumph, Obama and Hillari , Obama about US presidential elections, Obama speech demecratic convention

Barack Obama slams Trump and makes appeal for Hillary Clinton at philadelphia Convention.

ఒబామా ఆవేశం వర్కవుట్ అవుతుందా?

Posted: 07/28/2016 01:10 PM IST
Obama slams trump and makes appeal for hillary clinton

అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచారం ఊపు అందుకోంది. రిపబ్లిక్, డెమొక్రటిక్ లు ఆయా పార్టీల అభ్యర్థులను ఖరారు చేయటంతో వేడి మరింత రాజుకుంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఇరు అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు. కాగా, రాను రాను ప్రజా బలం పెంచుకుంటున్న హిల్లరీ క్లింటన్ కు మద్దతుగా ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం ఫిల‌డెల్ఫియాలో జరిగిన డెమొక్రటిక్ జాతీయ సదస్సులో అధ్యక్షుడు ఒబామా ప్రసంగించాడు.

అమెరికాను సురక్షితమైన చేతుల్లో పెడుతున్నానంటూ మొదలైన ఒబామా ఉపన్యాసం ఆద్యంతం ఆవేశంగా కొనసాగింది. హిల్లరీ ఒక‌ పోరాట యోధురాల‌ని, అంతేగాక‌ ఆమెకు రాజ‌నీతి బాగా తెలుసంటూ ఆయన ప్రశ్నంసలు కురిపించారు. హిల్లరీ ఓ త‌ల్లి, అమ్మమ్మ, ఓ సంఘ‌సేవ చేసే వ్యక్తి, దేశ భక్తురాలు ఇంత కన్నా మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి అమెరికాకు దొరకరు. అని పేర్కొన్నారు. దేశానికి అవసరమయిన సమయంలో తనను ఎలాగయితే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారో ఇప్పుడు హిల్లరీని ఎన్నుకోవాలంటూ ఆయన ప్రజలను కోరారు.

ఇదే సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ డొనాల్డ్ ట్రంప్ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నిక‌ల్లో ద్వేషాన్ని ఓట‌మిపాలు చేయాల‌ని ట్రంప్ ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రజల విలువ‌ల్ని విమ‌ర్శించే వారు ఫాసిస్టులైనా, క‌మ్యూనిస్టులైనా, జిహాదీలైనా, ఆఖరికి ప్రజా కంఠ‌కులైనా సరే ఓటమిని చవిచూడాల్సిందేన‌ని తెలిపారు. హిల్లరీలో అమెరికాను ఏలే తెగువ‌, ధైర్యం ఉన్నాయ‌ని ఒబామా వ్యాఖ్యానించారు.

ట్రంప్ కి అధ్యక్షుడు అయ్యే అర్హత లేద‌ని, అతను చెప్పేవ‌న్ని వ‌ట్టిమాట‌లేన‌ని చెప్పాడు. జ‌నాల‌ను ఆయ‌న‌ భ‌య‌పెట్టిస్తున్నాడ‌ని, అమెరికా ప్రజల గొప్పతనం ట్రంప్ మీద ఆధార‌ప‌డిలేద‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో చీఫ్ క‌మాండ‌ర్‌గా హిల్లరీ త‌న విధిని స‌మ‌ర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందని, ఈ పదవికి ఆమెను మించిన అర్హులు ఎవ‌రూ లేర‌ని ఆయ‌న కొనియాడారు. మొత్తానికి ఆయన స్పీచ్ భారీ హర్షాధ్వానాల నడుమ కొనసాగినప్పటికీ ప్రజల మెదళ్లోకి అది ఏ మాత్రం ఎక్కిందనేది వచ్చే వారం నిర్వహించబోయే ఒపినీయన్ పోల్ లో తెలిసిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Trump  Hillary Clinton  Democratic Convention  

Other Articles