అన్నచెల్లెళ్ల మంటూ అత్యాచారాలు, దోపిడీ | couple cheated girls as Bother and Sister raped after robbing

Couple cheated girls as bother and sister raped after robbing

TN couple cheated girls, Bother and Sister raped after robbing, Deena Dayalan Priyadarshini,

couple cheated girls as Bother and Sister raped after robbing.

వావివరుసలు మార్చుకుని మరీ రేప్ లు చేశారు

Posted: 07/28/2016 12:04 PM IST
Couple cheated girls as bother and sister raped after robbing

పవిత్రమైన అన్నాచెల్లెల సంబంధాన్ని నేరాలు చేసేందుకు వాడుకుందో జంట. బాహ్య ప్రపంచాన్ని నమ్మించి మరీ నీచమైన పనులు చేశారు. తిరుప్పూర్ జిల్లాకు చెందిన గురు దీనదయాళన్, ప్రియదర్శినిలు భార్యాభర్తలు. డబ్బు కోసం, విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న దురాశతో ఓ ఫ్లాన్ వేశారు. ఫేస్ బుక్ ద్వారా దీనదయాళన్ యువతులకు గాలం వేస్తుంటే, భార్య ప్రియదర్శిని అతనికి సహకరించేది. తమ వలలో పడిన అమ్మాయిలకు వీరు అన్నా చెల్లెళ్లమని పరిచయం చేసుకునేవారు.

తిరువేంబుయూర్ కు చెందిన ఓ కాలేజ్ విద్యార్థిని అదృశ్యం కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆ యువతే స్వయంగా వచ్చి తాను ప్రేమ పేరుతో ఎలా మోసం పోయిందో వివరిచింది. సదరు యువకుడు, అతని చెల్లి మంచివాళ్లుగా నటించి మోసం చేశారని ఫిర్యాదు చేసింది. ప్రేమిస్తున్నానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేసిన దీనదయాళన్, తన వద్ద 8 సవర్ల నగలు అపహరించిన తరువాత చెల్లెలితో కలసి పారిపోయాడని చెప్పింది. ఆమె ఇచ్చిన కొన్ని ఫోటోల ఆధారంగా, తిరుచ్చి బస్టాండ్ లో అన్నాచెల్లెళ్లుగా చెప్పుకుంటున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫేస్ బుక్ లో పరిచయమైన వారిని ప్రేమలోకి దింపేవాడని, పెళ్లి చేసుకుందామని, నగలతో రావాలని చెప్పేవాడని, మాయమాటలను నమ్మి ఎవరైనా వస్తే, ముందు వారిని దొచుకుని ఆపై అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఇప్పటిదాకా ఇలా 20 మంది యువతులపై అత్యాచారం, ఆపై 100 సవర్ల నగల దోపిడీ చేశారని వారు చెప్పటంతో పోలీసులు సైతం విస్తూ పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TamilNadu  couple  facebook  Brother-Sister  cheat  Deena Dayalan  Priyadarshini  

Other Articles

Today on Telugu Wishesh