రోజుకు 8 వేల సార్లు తుమ్ముతున్న బాలిక | Girl sneezes 8000 times a day doctors remain perplexed about the condition

Girl sneezes 8000 times a day doctors remain perplexed about the condition

Girl sneezes 8000 times, Ira Saxena sneeze disease, sneezes 8000 times a day, Colchester girl sneeze

Girl sneezes 8000 times a day, doctors remain perplexed about the condition. Ira Saxena's sneezing began about three weeks ago and she now emits around 10 involuntary episodes per minute.

ITEMVIDEOS:రోజుకు 8000 సార్లు తుమ్ముతోంది

Posted: 07/21/2016 11:46 AM IST
Girl sneezes 8000 times a day doctors remain perplexed about the condition

తుమ్ము... ప్రతీ ఒక్కరి జీవితంలో ఉండేదే. నాసిక రంద్రాలలో ఏదైనా అడ్డు పడితే అలాంటప్పుడు ఊపిరితిత్తుల నుండి ముక్కు నుండి నోటి నుండి తొలగించే ప్రక్రియలో తుమ్ము వస్తుంది. ఒక్కసారిగా వెలుతురుని చూసినప్పుడు గాని, కడుపు నిండుగా ఉన్నప్పుడు గాని, బాక్టీరియా వలన తుమ్ములు వ‌స్తాయి. జలుబు అయిన టైంలో దీని ఎఫెక్ట్ మరీ తీవ్రంగా ఉంటుంది. తుమ్మినప్పుడు వచ్చే శబ్ధం కంటే సుమారుగా నలబైవేల సూక్ష్మ జీవులు సెకనుకి వందమైళ్ళ వేగంతో గాల్లోకి వ్యాప్తి చెందడమే చాలా ప్రమాదం.

అయితే ఏ మాత్రం లాజిక్ లేని కొందరు బయటికి వెళ్లేప్పుడు తుమ్మితే అది అశుభమని, ఏదైనా విషయం మాట్లాడినప్పుడు ఎవరైనా తుమ్మితే సత్యం అని అంటుంటారు. రెప్పపాటులో వచ్చే తుమ్ము వల్ల శుభకార్యాలు ఆగిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ తుమ్ముల గోల పక్కనబెడితే... ఇక్కడ ఓ చిన్నారి తుమ్ముల గురించి చర్చించుకుందాం. సాధారణంగా ఏ మనిషి రోజుకీ పది పదిహేన్లు సార్ల కంటే ఎక్కువగా తుమ్మిన దాఖలాలు ఉండవు. కానీ, ఈ బాలిక తుమ్ములు మాత్రం చాలా ప్రత్యేకం.

 

ఇంగ్లాండ్ కోల్ చెస్టర్ కు చెందిన ఇరా సక్సేనా అనే తొమిదేళ్ల బాలిక రోజుకి అక్షరాల 8000 తుమ్ముతూ పాపం ఇబ్బంది ఎదుర్కోంటోంది. ఆమె తల్లి ప్రియా సక్సేనా కూతురి వింత వ్యాధ గురించి చెబుతోంది. మూడు వారాల క్రితం నిద్ర నుంచి లేచిన ఇరా తుమ్మటం ప్రారంభించిందట. ఇక అప్పటి నుంచి నిరాటంకంగా తుమ్ముతూనే ఉందని చెబుతోంది. డాక్టర్లకు చూపించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని ఆమె అంటోంది. సాధారణంగా జలుబు, లేదా అలర్జీ చేసినప్పుడు మాత్రమే తుమ్ములు వస్తాయి గానీ, ఇరా కండిషన్ అంతుబట్టకుండా ఉందని ఆమెను పరిక్షించిన ఓ వైద్యుడు తెలిపాడు. ఈ వింత వ్యాధితో ఆమె స్కూల్ కు కూడా వెళ్లలేకపోతుందని తల్లి ప్రియా వాపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి తుమ్ములు ఆపేది ఎప్పుడో తెలుసా? కేవలం నిద్రపోయినప్పుడు మాత్రమే...

2009లో వర్జీనియాకు చెందిన 12 ఏళ్ల బాలిక ఇలాగే వేల సంఖ్యలో తుమ్మి వింత వ్యాధి బారిన పడింది. ఆపై వైద్యుల సాయంతో మాములు స్థితికి చేరింది. ఇక గతేడాది టెక్సాకు చెందిన కాటేలైన్ అనే యువతి కూడా ఇదే సమస్యతో బాధపడుతూ... ఇప్పటికీ కోలుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girl  sneeze  8000 times  Ira Saxena  

Other Articles