రైతుల ఆత్మహత్యకు దెయ్యాలు కారణమన్న హోంమంత్రి | MP Home Minister says ghosts reason for farmers suicide

Mp home minister says ghosts reason for farmers suicide

MP Home Minister Bhupinder Singh, Bhupinder Singh farmers suicides, ghosts reason for farmers suicide

MP Home Minister bhupindar Singh says ghosts reason for farmers suicide.

దెయ్యాల అకౌంట్లోకి ఆ ఆత్మహత్యలు

Posted: 07/21/2016 12:51 PM IST
Mp home minister says ghosts reason for farmers suicide

ఆయన రాజకీయ నేత ఉన్నత చదువులు చదువుకున్నాడు. పైగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నాడు. కానీ, ఆయన మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా విస్తూ పోవాల్సిందే. మంత్రి మంత్రగాడిలా మారి అసెంబ్లీలో చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. మూడేళ్లుగా కరువు కాటకాలతో అల్లలాడి, పంటలు పండక, ఆర్థిక సమస్యలతో రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే వాటిని కాస్త దెయ్యాల ఖాతాలో వేసి చేతులు దులుపుకున్నాడు

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రైతుల ఆత్మహత్యల చేసుకోగా, విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ అడిగిన ప్రశ్నకు మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర. సింగ్ ఏం వివరణ ఇచ్చారో చూడండి. ‘‘ సెహోర్‌లో గత మూడేళ్లలో 418 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకు కారణం ఆర్థిక బాధలు కాదు, దెయ్యాలు. తమ వారు దయ్యాల వల్లే చనిపోయారని రైతుల బంధువులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ నివేదిక సమర్పిస్తున్నాం అంటూ హోం మంత్రి భూపేంద్ర అసెంబ్లీలో బుధవారం చెప్పారు. మధ్యలో కలుగజేసుకున్న శైలేంద్ర... దెయ్యాలు, చేతబడులు లాంటి మూఢనమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుందా అని ప్రశ్నించారు. అయితే దీనికి మాత్రం మంత్రిగారి దగ్గరి నుంచి సమాధానం రాలేదు.

అసెంబ్లీ ముగిసిన తర్వాత శైలేంద్ర విలేకరులతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం చెప్పిన సమాధానం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. 418 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే 117 మంది బలవన్మరణాలకు కారణాలు నమోదు చేయలేదన్నారు. దీనిపై త్వరలో ప్రధానిని కలిసి నివేదిక అందజేస్తామని ఆయన అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Home Minister  Bhupinder Singh  farmers suicides  ghosts  

Other Articles