ప్రైవేట్ స్కూళ్ల ఓటీఎఫ్ దోపిడి పై హైకోర్టు ఆగ్రహం | HC angry over private schools for collecting one time fee in lakhs

Hc angry over hyderabad private schools for collecting one time fee in lakhs

Hyderabad private schools, One Time Fee, Hyderabad Schools Parents Association, HSPA PIL in High cout, High Court about schools

HC angry over private schools for collecting one time fee in lakhs. Hyderabad Schools Parents Association (HSPA) challenges OTF, says it is collected over and above the regular fee.

బడి పేరుతో బిజినెస్ లు చేస్తున్నారా?

Posted: 07/19/2016 11:45 AM IST
Hc angry over hyderabad private schools for collecting one time fee in lakhs

విద్యార్థులు భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారంటూ యాజమాన్యాలపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సహేతుక ఫీజుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను జలగల్లా పీల్చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది.

రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ వన్‌టైం స్పెషల్ ఫీజు పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోషియేషన్ (హెచ్‌పీఎస్) తోపాటు మరోకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

అధిక ఫీజుల వసూలు, ముఖ్యంగా వన్ టైం ఫీజు (ఓటీఎఫ్) పేరిట చేస్తున్న దోపిడీని తీవ్రంగా ఈ సందర్భంగా బెంచ్ తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని పాఠశాలలు ఓటీఎఫ్ కింద ఏకంగా రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేసినందుకు 12 స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని...సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో తిరిగి నోటీసులు జారీ చేశామని వివరించారు. ఇంకోవైపు హెచ్‌పీఎస్ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్... యూజీసీ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించాల్సి వస్తోందంటూ చెప్పేందుకు ప్రయత్నించగా, అధిక ఫీజుల వసూలును సమర్థించుకోవద్దని ధర్మాసనం ఆగ్రహించింది.

విద్యార్థి చక్కని చదువుకు కళాశాలల కన్నా ముందు స్కూల్లే సోపానాలు. అలాంటిది పాఠశాల దశలో నాణ్యమైన విద్య అందించకపోగా, దోచుకుంటున్నారు. ఇది సిగ్గు చేటు. వారికి కళ్లెం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొంది. కాగా, ప్రభుత్వం చేతగానితనంతో 4 వేల పాఠశాలు మూత పడ్డాయన్న అంశంపై విస్మయం వ్యక్తం చేసిన బెంచ్ అంత కష్టంగా ఉంటే కొన్నింటిని ప్రైవేటు పాఠశాలలకు అప్పగించాలని అదనపు అడ్వోకేట్ జనరల్ కు సూచించింది. ఈ అంశంతోపాటు ఫీజుల వసూళ్లకు నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తూ... కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  Private Schools  OTF  HSPA  PIL  

Other Articles