After jdu mla shyam bahadur singh shakes leg bar dancers, BJP MLA Pranav Singh caught on camera showering money on dancers

Bjp mla captured on video showering currency notes on dancers

Kunwar Pranav Singh Champion, BJP MLA, Khanpur, Uttarkhand, pranvav singh showers money on dancers, BJP MLA Pranav Singh caught on camera, BJP MLA Pranav Singh showers money, shyam bahadur ssngh, shyam bahadur singh yadav, shyam bahadur singh mla, jdu mla dance, bihar mla obscene dance, bihar mla dance, jdu mla dance

After jdu mla shyam bahadur singh shakes leg bar dancers, Now BJP MLA Pranav Singh caught on camera showering money on dancers, The incident occurred before the arrival of Union Minister Krishan Pal Gurjar at the event.

ITEMVIDEOS: డాన్సర్లపై డబ్బును వెదజల్లిన బీజేపి ఎమ్మెల్యే..

Posted: 07/19/2016 11:16 AM IST
Bjp mla captured on video showering currency notes on dancers

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రజాప్రతినిధులు. జనం కోసం, జనంతో, జనంలో ఒక్కడిలా వుంటూ.. తన పనితీరు ఏంటో అభివృద్ది పనుల్లో చాటుతూ తన సత్తాను నిరూపించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా బహిరంగ వేదికలపై బార్ డాన్సర్లపై తమ ప్రేమను చాటుతున్నారు. బీహార్ డాన్సింగ్ ఎంఎల్ఏగా కూడా ఇప్పటికే రికార్డులకెక్కిన శ్యామ్ బహదూర్ సింగ్ ఇటీవల జరిగిన ఓ రాష్ట్ర వేడుక వేదికలో మద్యం మత్తులో బార్ డాన్సర్లతో కలసి చిందులేని, అభ్యంతరకర రీతీలో స్టెపులేసి వార్తల్లో నిలిచారు. ఈ వీడియో నెట్ లో సంచలనంగా మారి మారక ముందు మరో ఎమ్మెల్యే కెమెరాకు చిక్కారు.



భారతీయ సంస్కృతి, సంప్రదాయం గురించి నిత్యం ప్రసంగించి. దానినే అలవర్చుకోవాలన్న బీజేపి అధిష్టానం.. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిని ఒప్పించి, మెప్పించి.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. అలాంటి బీజేపికి ఇప్పుడు ఇబ్బందికర పరిణామం ఎదుర్కోనేలా చేస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కున్వార్ ప్రణవ్ సింగ్ ఛాంఫియన్. ఉత్తరాఖండ్ ఖాన్పూర్ కు చెందిన ఈ ఎమ్మెల్యే.. స్థానిక రూక్కీ నగరంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభావేదికపై నృత్యం చేస్తున్న డాన్సర్ పై కరన్సీ నోట్లను విసిరాడు. కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ ఆ సభా వేదికకు చేరుకునే ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ఎమ్మెల్యే కరెన్సీ నోట్లను వెదజల్లడాన్ని కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

కాగా ఈ ఎమ్మెల్యేకు ఇదేం కోత్త కాదని కూడా సమాచారం చక్కర్లు కోడుతుంది. ఈయనగారు ఇలా పబ్లిక్ ఈవెంట్లలో డాన్సులేయడం ఆయనకు పరిపాటేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు కూడా ఈయనగారు ఇలానే ఓ బహిరంగ వేదికపై డాన్సర్లతో కలసి చిందులేశారు. వెంటనే అక్కడకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇలా చేయకూడదని వారించడంతో ఇకవారిపై డబ్బులను వెదజల్లారు. అంతటితో ఆగకుండా వేదికలో మరో మూలన పార్టీ నేతలతో కలసి స్టెప్పులేశారు. ఎలాగంటారా..? మీరే చూడండీ..!

ఉత్తరాఖండ్ లోని హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పడగోట్టి.. రాష్ట్రపతి పాలనకు కేంద్ర సిఫార్సు చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పినట్లు ఎమ్మెల్యేలకు డబ్బులిస్తూ ముఖ్యమంత్రే స్వయంగా దోరికిపోయాడని, వాటికి సంబంధించిన వీడియోలు కూడా వున్నాయన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వాన్ని సైతం పక్కనబెట్టామన్న ఆయన మరీ తమ పార్టీ ఎమ్మెల్యే వీడియో చూసిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని పార్టీని పురమాయిస్తారో వేచి చూడాలి. ఇదిలా వుంటే బీజేపి ఎార్టీ తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా కరెన్సీ నోట్లు ఇచ్చిందని, అందుచేతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కరెన్సీ నోట్లు డాన్సర్లపై వెదజల్లుతున్నారన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kunwar Pranav Singh Champion  BJP MLA  Khanpur  Uttarkhand  JDU MLA  shyam bahadur singh  

Other Articles