10 CRPF men killed in encounter with Maoists in Bihar's Dumari Nala forest

10 security personnel 4 maoists killed in bihar encounter

india, 10 crpf personnel killed, bihar crpf maoist encounter, Central Reserve Police Force, crpf killed in encounter, CRPF, Bihar, Maoists, Dumari Nala forest, gaya forest, central reserve police force, bihar maoists, bihar insurgency, jungle raj

The extremists set off IEDs and engaged security forces in a heavy gunfight, in one of the worst anti-Naxal operations in recent times.

బీహార్ లో పెట్రేగిపోయిన మావోలు.. 10 మంది పోలీసుల మృతి

Posted: 07/19/2016 08:34 AM IST
10 security personnel 4 maoists killed in bihar encounter

బిహార్‌లో మావోయిస్టులు మళ్లీ పేట్రేగిపోయారు. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో పోలీసు దళాలను ట్రాప్ లో ఇరికించి మరీ వారిపై కాల్పులకు తెగబడ్డారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తొలిసారిగా జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో పది మంది భద్రతా దళ సభ్యులు మరణించారు. మావోల చర్యలను ప్రతిఘటిస్తూ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా బిహార్‌-జార్ఖండ్‌ ప్రత్యేక ప్రాంత కమిటీకి చెందిన సభ్యులుగా భావిస్తున్నారు.

మావోయిస్టులు తీవ్రస్థాయి ప్రతిఘటన చూపడంతో.. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన జవాన్లను తీసుకురావడానికి పంపిన హెలికాప్టర్‌ పట్నాకు తిరిగి వచ్చేసింది. ఘటన స్థలంలో 17 అతిశక్తిమంతమైన ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పట్నాకు 172 కిలోమీటర్ల దూరంలో, ఔరంగాబాద్‌-గయా జిల్లాల సరిహద్దుల్లోని దుమారీ నాలా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంజీవ్‌ జీ సారథ్యంలోని నక్సల్‌ దళం సంచరిస్తున్నదన్న సమాచారంతో రెండు రోజులుగా ప్రత్యేక దళాలు గాలింపు జరుపుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

అది ఇది కేవలం పోలీసులను ట్రాప్ చేయడానికి మావోయిస్టులు అడిన నాటకంగా తెలుస్తుంది. మావోయిస్టుల ప్రభాల్యం ఉన్న ప్రాంతానికి అందులోనూ వారికి అనుకూలంగా ఉండే ప్రాంతానికి భద్రతా సిబ్బంది రప్పించిన మావోలు వారినే టార్గెట్ గా చేసుకుని ఐఈడీని పేల్చి.. తూటాలవర్షం కురిపించారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మావోయిస్టుల ఉచ్చులోంచి తప్పించుకొనే క్రమంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని వెల్లడించాయి. తప్పించుకొని పోయిన మావోయిస్టులను వేటాడే క్రమంలో కాల్పులు కొనసాగుతున్నాయని ఈ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10 crpf personnel killed  bihar  crpf  maoist  encounter  duman nala forest area  

Other Articles