ఇండియాలో తొలి తల్లిపాల ఏటీఎం | Puducherry ATM gives out mother's milk

Puducherry atm gives out mother s milk

Amudham Thaippal Maiyam, mother's milk ATM in India, Jipmer ATM, mothers milk bank and ATM

Puducherry Jipmer ATM gives out mother's milk. Amudham Thaippal Maiyam' (ATM) will also offer breastfeeding counselling to mothers.

ఆ ఏటీఎంతో ప్రాణాలు నిలుస్తున్నాయి

Posted: 07/19/2016 09:13 AM IST
Puducherry atm gives out mother s milk

డబ్బు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఏటీఎంలను ఆపై కొన్ని ప్రాంతాల్లో నీటిని అందించేందుకు కూడా వాడుతున్నారు. ఇక బాగా ధనికులు ఉన్న గల్ఫ్ లాంటి దేశాల్లో బంగారం అందించేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. కానీ, ఇక్కడ చెప్పబోయేది మాత్రం కాస్త స్పెషల్. ఇది ఏకంగా తల్లి పాలను అందించే ఏటీఎం. ఎక్కడో కాదు, మనదేశంలోనే దీనిని నెలకొల్పారు.

నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులను రక్షించేందుకు పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్ మెర్) ఈ ఏటీఎంను ప్రారంభించింది. ‘అముధం తైప్పల్ మైయమ్(ఏటీఎం)గా పిలిచే ఈ ఏటీఎంలు, నెలలు నిండకుండా పుట్టే శిశువులకు తల్లిపాలు ఇచ్చి వారి ప్రాణాలు కాపాడతాయి. అంతేకాదు తల్లులకు ‘బ్రెస్ట్ ఫీడింగ్’పై కౌన్సెలింగ్ కూడా ఇస్తాయి.

ప్రతి నెల 15 వందల మంది జిప్ మర్ లో పుడుతున్నారు. వీరిలో 30 శాతం మంది నెలలు నిండాకుండానే తక్కువ బరువుతో పుడుతున్నారు. చాలా మంది చనిపోతున్నారు కూడా. వీరికి తల్లిపాలు అవసరం ఎంతో ఉంటుంది. అందుకనే నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్-ఎన్ఐసీయూ)లో ఈ తల్లిపాల ఏటీఎంను ఏర్పాటు చేశాం’’ అని జిప్ మెర్ డైరెక్టర్ ఎస్‌సీ పరిజా తెలిపారు. గత బుధవారం ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంకు మంచి స్పందన రావటంతో మరిన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. కాగా, గత కొద్దిరోజుల క్రితం దేశంలోనే తొలిసారి మధురైలో తల్లిపాల బ్యాంకును నెలకొల్పిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puducherry  Jipmer  ATM  Amudham Thaippal Maiyam  mother's milk  

Other Articles