గోల్డెన్ టెంపుల్ లో గిన్నెలు తోమిన కేజ్రీవాల్ | Kejriwal performs sewa at Golden Temple

Kejriwal performs sewa at golden temple

Arvind Kejriwal washed utensils, Arvind Kejriwal washed at golden temple, Kejriwal cleaned dishes at golden temple, AAP Punjab youth manifesto, AAP Punjab youth manifesto controversary

AAP national convener and Delhi Chief Minister Arvind Kejriwal washed utensils at Golden Temple for the party's recent gaffe over its youth manifesto that triggered a controversy.

చేసిన తప్పుకు ఎంగిలి గిన్నెలు కడిగిన సీఎం

Posted: 07/18/2016 09:54 AM IST
Kejriwal performs sewa at golden temple

తాను చేసిన తప్పుకు స్వీయ శిక్ష అని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గిన్నెలు కడిగారు. సోమవారం ఉదయం అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ కు చేరుకున్న ఆయన తోటి నేతలతో కలిసి పనులు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ జూలై 3న విడుదల చేసిన '51 పాయింట్ యూత్ మ్యానిఫెస్టో' ముఖచిత్రంపై మత పవిత్గ గ్రంథాలన్ని సూచించాడు. అంతేకాదు గోల్టెన్ టెంపుల్ చిత్రం కూడా సూపర్ ఇంపోజ్ కావటంతో విమర్శలు చెలరేగాయి. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఓ మతానికి చెందిన చిత్రం ప్రింట్ అయిందని వెల్లడించిన ఆయన, ఈ ఉదయం అక్కడి కిచన్ లోకి వెళ్లి వాడిన వంటపాత్రలను శుభ్రం చేశారు.

"స్వచ్ఛందంగా పని చేసేందుకే నేను ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా జరిగిన తప్పది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది" అని తెలిపారు. దాదాపు గంటకు పైగా దేవాలయంలో గడిపిన 'ఆప్' చీఫ్, ఆపై కాసేపు గరిట తిప్పి ప్రసాదాల తయారీలో సహాయపడ్డారు.

ఇక పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ ను, పార్టీ గుర్తు చీపురును పక్కపక్కనే ఉంచి మత భావజాలాలను దెబ్బతీశాడని ఆప్ ప్రతినిధి అశిష్ కేతన్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆయన కూడా కేజ్రీవాల్ వెంటే ఉండి కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం. అశిష్ పై సెక్షన్ 295-A కింద అమృత్ సర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  national convener  Delhi CM  Arvind Kejriwal  Golden Temple  Punjab  youth manifesto  controversy  

Other Articles

Today on Telugu Wishesh