ట్రంప్ కి వ్యతిరేకంగా మహిళల నగ్న ప్రదర్శన | A hundred nude women protested against Trump

A hundred nude women protested against trump

nude women protest, nude women for Donald Trump, nude protest at Republican Convention, protested against Trump, Spencer Tunick nude photoshoot

A hundred nude women protested against Trump at the Republican Convention.

ఆయన కోసం మహిళలు నూలు పోగు లేకుండా...

Posted: 07/18/2016 10:24 AM IST
A hundred nude women protested against trump

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు వ్యతిరేకత రాను రాను పెరిగిపోతుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఆయనను ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్షుడిగా గెలిపించకూడదని ప్రజలు రోడెక్కి పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా క్లీవ్లాండ్లో సోమవారం వందమందికిపైగా మహిళలు వినూత్న ప్రదర్శను చేపట్టారు. అద్దాలు చేతబట్టి నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చారు.

ప్రముఖ పోటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యునిక్ ఇచ్పిచిన లుపు మేరకు మొత్తం 130 మంది మహిళలు ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలు దిగారు. ‘‘ఆయనో పరాజితుడు... వైట్ హౌస్ లోకి వెళ్లేందుకు ఏ మాత్రం అర్హత లేదు’’ అన్న నినాదంతో ఈ షూటను నిర్వహించారు. ఇక్కడ బహిరంగ నగ్న ప్రదర్శన చట్టవిరుద్ధం. అయినా తాను ఫొటో షూట్ నిర్వహించిన ప్రాంతం యజమానికి అందుకు అంగీకరించారు. రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్ను ప్రకటించే సమయంలో కార్యాలయం బయటే ఈ నిరసన జరుగుతుండటంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తాను ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధించి ఫొటో షూట్ నిర్వహించలేదన్న ట్యూనిక్.. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలను కోరుతున్నాడు. ఈ చిత్రాన్ని నంబరు 8 ఎన్నికలకు ముందు ఆవిష్కరించనున్నట్టు ఆయన చెబుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude women  Republican Convention  Donald Trump  Spencer Tunick  

Other Articles