Your Beard Or My Life, Threatens Wife Of Devout Muslim Cleric

Shave or i ll kill myself wife to cleric

up clerik, clean shave, smart phone, chating, wife threatens, suicide, meerut, uttarpradesh, 36-year-old cleric, Eid shopping, western dresses, threatens to end life, district magistrate, pankaj yadac, arshad badruddin, true lover of islam, sahana, Bollywood actors, Salman Khan, Shah Rukh Khan

A 36-year-old cleric in Meerut is confronting a bizarre ultimatum from his wife, who is threatening to end her life if he does not shave off his beard. "She likes clean-shaven men like Bollywood actors Salman Khan and Shah Rukh Khan."

భర్తను బ్లాక్ మెయిల్ చేసిన భార్య.. అ హీరోల్లా..

Posted: 07/18/2016 08:54 AM IST
Shave or i ll kill myself wife to cleric

నువ్వు బాలీవుడ్ హీరోలు సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ల మాదిరిగా గడ్డ గీసుకుని స్మార్ట్ గా వుంటావా..? లేదా..? లేకపోతే నేను ఆత్మహత్య చేసకుని చనిపోతాను అంటూ ఓ భార్య భర్తను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్టంలోని మీరట్ పట్టణంలో సంచలనంగా మారింది. అంతేకాదు తన భర్తను ఉడికించేందుకు స్మార్ట్ ఫోన్ లలో వేరే మగాళ్లతో ఛాటింగ్ చేయడం కూడా ప్రారంభించింది. ఇక పిల్లలకు సంప్రదాయానికి విరుద్దంగా విదేశీ దుస్తులు కొనడంతో దిక్కుతోచని భర్తకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అయితే, సదరు వ్యక్తి ముస్లిం మత గురువు కావడం ఇక్కడ విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. మీరట్ పట్టణానికి చెందిన 36 ఏళ్ల అర్షద్ బద్రుద్దీన్ ఓ మసీదులో పేష్ ఇమాంగా పనిచేస్తున్నాడు. అర్షద్ బద్రుద్దీన్ 2001లో హాపూర్ జిల్లా పిల్ఖువా పట్టణానికి చెందిన సహానాను పెళ్లాడాడు. ఈయనకు నలుగురు పిల్లలు జన్మించారు. పెళ్లి అయి నలుగురు పిల్లలు పుట్టాక తనను బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్‌లా శుభ్రంగా గెడ్డం గీసుకోవాలని, లేకుంటే పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంటానని 33 ఏళ్ల భార్య సహానా బెదిరిస్తుందని భర్త అర్షద్ బద్రుద్దీన్ సాక్షాత్తు జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు.

తాను ఇస్లాం మతాన్ని పాటిస్తూ మసీదులో ఇమాంగా పనిచేస్తున్నానని, ఇస్లాం మతాచారానికి విరుద్దంగా తానెలా గెడ్డం గీసుకోవాలని అర్షద్ ప్రశ్నించారు. తన ఆకాంక్షలకు విరుద్ధంగా తన భార్య స్మార్టు ఫోన్ లో రాత్రీ పగలూ ఇతర మగాళ్లతో ఛాటింగ్ చేస్తుందని, ఆమెకు కౌన్సెలింగ్ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ కు అర్షద్ మొరపెట్టుకున్నారు. రంజాన్ ఈద్ పండుగ షాపింగ్ కు వెళ్లి పిల్లలకు సంప్రదాయానికి విరుద్ధంగా విదేశీ దుస్తులు కొందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన భార్య ఇటీవల గదిలోకి వెళ్లి ఓ తాడు సాయంతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకునేందుకు ప్రయత్నించిందని, తాను చూసి వెంటనే తన బంధువుల సాయంతో అతికష్టం మీద కాపాడానని జిల్లా మేజిస్ట్రేట్ కు రాసిన లేఖలో అర్షద్ వివరించారు. భార్య బ్లాక్ మెయిలింగ్ పై అర్షద్ రాసి ఫిర్యాదును సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు పంపించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర విలేకరులకు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : up clerik  clean shave  smart phone  chating  wife threatens  suicide  meerut  uttarpradesh  

Other Articles