Farmer's Harappan find triggers gold rush in UP

Farmer s harappan find triggers gold rush in up

gold rush, Bijnor, Chandpur area, artefacts, Indus Valley civilization, trench, copper utensils, Harinagar village, treasure hunters, wildfire, Tularam Singh, district magistrate B Chan drakala, Archaeological Survey of India, Bhuvan Vikram, Harappan period,

A gold rush is underway in Bijnor's Chandpur area ever since a local farmer recently hit upon a cache of artefacts believed to be from the Indus Valley civilization while digging a trench in his field.

పోల్లాలను తొవ్వితే బంగారం లభిస్తుందా..? అక్కడ..

Posted: 07/17/2016 08:21 AM IST
Farmer s harappan find triggers gold rush in up

ఉత్తర్ ప్రదేశ్ లోని రైతులు తమ పోలాలను తెగ తొవ్వేస్తున్నారు. తొలుత ఒక రైతు తన పోలం తవ్వగా, ఆ తరువాత మరికొందరు రైతులు, విషయం దావనంలా వ్యాపించడంతో ఒకరు కొందరు నుంచి మొత్తం గ్రామినికి చెందిన రైతులందరూ తమ పంటపోలాలను వారే స్వయంగా తొవ్వేస్తున్నారు. ఇంతకీ వారు పోలాలను తొవ్వడానికి కారణం ఏంటి..? ఊరంతా దావనంలా వ్యాపించిన వార్త ఎంటీ..? వివరాల్లోకి వెళ్తే.. ుత్తర్ ప్రదేశ్, బిజ్నోర్ జిల్లాలోని చాంద్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు తన పొలంలో దున్నుతుండగా హరప్పా నాగరికతకు చెందిన 4,500 సంవత్సరాలకు పూర్వం తయారుచేసిన రాగి వస్తువులు బయటపడ్డాయి.

దీంతో ఆశ్చర్యపోయిన రైతు పొలంలో బంగారపు గని ఉండే అవకాశం ఉందని తవ్వకాలు ప్రారంభించాడు. కొద్ది సమయంలో ఈ వార్త హరినగర్ గ్రామం మొత్తం పాకడంతో ఆ రైతు చుట్టుపక్కల పొలాలు కలిగిన రైతులు కూడా బంగారం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ తవ్వకాల్లో మరికొన్ని రాగి వస్తువులు బయటపడ్డాయి. బంగారం కోసం హరినగర్ గ్రామం పొలాల్లో తవ్వకాలు జరుపుతున్నారనే వార్తను తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ బీ చంద్రకళ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సమాచారం అందించారు.

దీంతో హూటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న ఏఎస్ఐ బృందం హరప్పా నాగరికతకు చెందిన వస్తువులు బయటపడ్డ ప్రదేశాన్ని పరిశీలించింది. ఇతరులను ఆ ప్రదేశంలోకి ప్రవేశించకుండా పోలీసుల సాయం తీసుకుంది. వస్తువుల గురించి మాట్లాడిన ఏఎస్ఐ సూపరింటెండెంట్ భువన్ విక్రమ్ తవ్వకాల్లో దొరికిన రాగి వస్తువులన్నీ హరప్పా నాగరికతకు చెందినవిగా భావిస్తున్నామని తెలిపారు. పరిశోధనలు పూర్తయిన తర్వాత వీటి కచ్చితమైన వయస్సును నిర్దారిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని విలువైన వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold rush  Bijnor  Chandpur  Harinagar  copper-utensils  crop field  indus valley civilization  

Other Articles