Indian firm supplies green tea to Donald Trump in a bid to purify his mind

Indian company wants to cleanse trump sends him 6 000 bags of green tea

#TeaForTrump, assam green tea, 6000 green tea bags, ww may change him, Donald Trump,green tea,US Presidential Elections 2016, shila dixit, suzuki scooter, india bulls, income tax, cancer, health

While the world is concerned over the rise of a far-right leader like Trump, entrepreneurs and marketing agencies could not refrain from using his negative popularity to promote their products

ట్రంప్ కు అస్సాం టీ బ్యాగులు.. పరిశుద్ద మనస్సు కోసం..

Posted: 07/14/2016 07:08 PM IST
Indian company wants to cleanse trump sends him 6 000 bags of green tea

అమెరికా అధ్యక్షులకు ఆపర్లు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పదవికి విడ్కోలు పలికిన తరువాత తన న్యాయసంస్థలలో పనిచేసేందుకు దుబాయ్ కు చెందిన ఓ న్యాయవాది ఆపర్ ఇచ్చారు. ఇస్లాం గురించి ఒబామాకు మరింత లోతుగా తెలుసుకోవడం, అధ్యయనం చేయడం కోసమే తాను ఈ ఆఫర్ ఇస్తున్నానని అ న్యాయవాది ప్రకటించారు కూడా. అందుకు అయన వేతనంతో పాటు పలు సదుపాయాలను కూడా కల్పిస్తానని చెప్పడం గమనార్హం. సరిగ్గా అలాగే అస్పాం నుంచి కూడా అమెరికా రిపబ్లికన్ రేసులో అధ్యక్ష బరిలో వున్న డోనాల్డ్ ట్రంప్ కు కూడా ఇలాంటి అఫర్ ఇచ్చారు.
 
తాము పంపిన అస్సాం గ్రీన్ టీ తాగి మనసును శుద్ధి చేసుకోవాలని కోరుతూ భారత్‌కు చెందిన ప్రముఖ టీ సంస్థ ఒకటి ట్రంప్‌కు గ్రీన్ టీ బ్యాగులు పంపింది. ‘మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడానికి సమయం మించిపోలేదు’ అనే సందేశంతో ‘రియల్’ టైకూన్‌కు టీ బ్యాగులు పార్శిల్ చేసింది.‘‘ట్రంప్.. భారత్ తరపున మీకు నమస్కారాలు. ప్రకృతి సిద్ధమైన అస్సాం టీ బ్యాగులను మీకు పెద్ద మొత్తంలో పంపిస్తున్నాం. ఈ టీ శరీరంలోని ప్రమాదకర ఫ్రీరాడికల్స్‌పై పోరాడుతుంది. మనసును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యం సమతౌల్యంగా ఉండేలా చూస్తుంది. మనుషులను స్మార్ట్‌గా కూడా చేస్తుందని నిరూపితమైంది. మీకోసం, అమెరికా కోసం, ప్రపంచం కోసం దయచేసి ఈ టీని రోజూ తాగండి’’ అని కోల్‌కతాకు చెందిన టీ-ఎ-మి సంస్థ ఓ వీడియోలో పేర్కొంటూ టీ బ్యాగులు పంపింది.
 
న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌కు టీ కంపెనీ పంపిన 6వేల టీ బ్యాగులు డెలివరీ అయ్యాయి. ‘ప్రపంచమంతా విచారిస్తోంది. మేం మిమ్మల్ని ఎలాగూ ఆపలేం. కాకపోతే మిమ్మల్ని మార్చగలం’’ అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ పంపిన టీ బ్యాగులు దాదాపు నాలుగేళ్లపాటు సరిపోతాయి. గ్రీన్ టీలోని గొప్పతనం ట్రంప్‌కు గొప్ప మేలు చేస్తుందని, తద్వారా ఆయన దేశానికి, ప్రపంచానికి కూడా మేలవుతుందని టీ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘ఇంకా కావాలంటే కూడా పంపిస్తాం’’ అని పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చిన టీ బ్యాగులపై ట్రంప్ వైపు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TeaForTrump  Donald Trump  assam green tea  US Presidential Elections 2016  Indian Firm  

Other Articles