సంచలనం సృష్టిస్తున్న బీబీసీ ఒలంపిక్స్ వీడియో | BBC Sport special video on Rio olympics

Bbc sport special video on rio olympics

Rio olympics animation video, Rio olympics 2016 BBC video, BBC special video on Rio Olympics, BBC sport Animation Video

BBC Channel special animation video with animals on Rio olympics viral in Internet.

ITEMVIDEOS:సంచలనం సృష్టిస్తున్న బీబీసీ ఒలంపిక్స్ వీడియో

Posted: 07/14/2016 04:12 PM IST
Bbc sport special video on rio olympics

రియో ఒలంపిక్స్ 2016 ఇంకా 22 రోజుల కౌంట్ డన్ ఉంది. బ్రెజిల్ గ్రాండ్ సిటీ రియో డి జెనిరియోలో ఆగష్టు 5 నుంచి అట్టహసంగా ప్రారంభం కానున్నాయి. ఒలంపిక్ జ్యోతి దేశాలన్నీ చుట్టేయటం దాదాపుగా పూర్తి కావస్తోంది. ఆటగాళ్లంతా సమరానికి సిద్ధమైపోతున్నారు. ఈ హడావుడి కొనసాగుతుండగానే ప్రముఖ అంతర్జాతీయ మీడియా బీబీసీ విడుదల చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది.

బీబీసీ తమ స్పోర్ట్ ఛానెల్ కోసం రూపొందిన ఒక ట్రైలర్ నెట్లో వైరల్ గా మారింది. అడవి లోని జంతువులన్నీ సీరియస్ గా వాటి వాటి ఆటలను సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తుంటాయి. మొసళ్లు, చిరుత పులలు, చింపాంజీలు, గొరిల్లాలు ఇలా అడవిలోని ఏ జంతువును వదలకుండా ఈ వీడియోలో చూపించారు. అంతలో గొరిల్లా ఒక్కసారిగా గట్టిగా అరవగానే పోటీ ప్రారంభమౌతుంది. చివర్లో అవన్నీ మనుషులుగా మారి... రియో నగరం వైపు చూసే ముగింపు అద్భుతంగా ఉంది.

నిమిషంన్నర ఉన్న ఈ వీడియో పూర్తి స్థాయి యానిమేషన్ తో రూపొందించారు. జంగిల్ బుక్ కు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ వీడియో కోసం వినియోగించినట్లు సమాచారం. ఒలంపిక్స్ 2016 టెలికాస్టింగ్ రైట్స్ చేజిక్కించుకున్న బీబీసీ స్పోర్ట్స్ తమ ఛానెల్ ప్రచారం కోసం చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio olympics 2016  BBC sport  animation video  

Other Articles