ఇక ట్యాంక్ బండ్ లో నిమజ్జనం బంద్? | Special water pools for vinayaka Immersion in Hyderabad

Special water pools for ganesh immersion in hyderabad

No Hussain Sagar for Ganesh immersion, special pools for Immersion in hyderabad, ganesh Immersion 2016 in hyderabad

No Hussain Sagar, Special water pools for vinayaka Immersion in Hyderabad.

ఇక ట్యాంక్ బండ్ లో నిమజ్జనం బంద్?

Posted: 07/14/2016 03:12 PM IST
Special water pools for ganesh immersion in hyderabad

తెలంగాణ ప్రభుత్వం మరో అరుదైన నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది నుంచి వినాయక నిమజ్జన కోసం ప్రత్యేక కొలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటిదాకా టాంక్ బండ్ లోనే నిర్వహిస్తుండగా, హైకోర్టు సూచనలతో కంపుతో నిండిపోయిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం కనీసం ఈ యేడాది నుంచి అయినా అందులో విగ్రహాలను పడకుండా చూడాలనే ఉద్దేశంలో ఉంది. బెంగళూరు తరహాలో ప్రత్యేక నిమజ్జన కొలనును అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

తొలుత ఇందిరా పార్క్ లోని నీటి కొలనును విస్తరించి దానికి వినాయక కొలనుగా నామకరణం చేసి వినియోగించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే భారీ వ్యయంతో కూడుకున్న పని కావటంతో ఆ ఆలోచన విరమించుకుంది. ఇక ఇప్పుడు నగర వ్యాప్తంగా చిన్న చిన్న చెరువులను అందుకు వినియోగించుకోవాలని సూచించింది. ఇప్పటికే ప్రభుత్వం అందుకు నిధులు విడుదల చేయగా, గురువారం రూ.4.90 కోట్లతో చేపట్టిన చర్లపల్లి చెరువు సుందరీకరణ పనులను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించాడు.

ఇక రూ.60 లక్షలతో చేపట్టిన గణేష్ నిమజ్జన కొలనును కూడా శంకుస్థాపన చేశారు. కాగా, హైదరాబాద్ లో జరిగే వినాయక నిమజ్జనం ముంబై తర్వాత స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విగ్రహాల ఎత్తు 15 అడుగులు మించకూడదని అత్యున్నత న్యాయస్థానం ఉత్సవ కమిటీలకు సూచించింది. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ లో విగ్రహాలు నిమజ్జనం చేయకూడదనే ప్రభుత్వ ఆదేశాలను ఎంత మంది పాటిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh Immersion  Hyderabad  telangana govt  special pools  

Other Articles