ఉడ్తా తెలంగాణ గురించి ఎప్పుడైనా విన్నారా? | Telangana 2nd in solo women travellers

Telangana 2nd in solo women travellers

telangana girls alone journey, indian girls alone journey

Telangana 2nd in solo women travellers in India.

ఉడ్తా తెలంగాణ గురించి ఎప్పుడైనా విన్నారా?

Posted: 07/13/2016 08:48 AM IST
Telangana 2nd in solo women travellers

ఉడ్తా పంజాబ్ గురించి తెలుసు. ఈ ఉడ్తా తెలంగాణ ఏంటీ అనుకుంటున్నారా? ‘కీ ఇండికేటర్స్ ఆఫ్ డొమెస్టిక్ టూరిజం ఇన్ ఇండియా’ పేరుతో నిర్వహించిన ఓ సర్వే తెలిపిన విషయాల ప్రకారం... ఒంటరి
ప్రయాణాలలో తెలంగాణ మహిళలు టాప్ పొజిషన్ లో ఉన్నారని తేలింది. ఈ విషయంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా తర్వాతి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుంది.

2014 జులై నుంచి జూన్ 2015 వరకు తెలంగాణలోని 86 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 11 లక్షల మంది మహిళల్లో 60 శాతం మంది రాత్రిపూట ఒంటరి ప్రయాణాలు చేస్తున్నట్టు సర్వేలో తేలింది. ఈ విషయంలో
పంజాబ్ 66 శాతంతో మొదటి స్థానంలో ఉంది. దక్షిణాది ప్రాంతంలోని ప్రజలకు విశాల దృక్ఫథం ఎక్కువని, కాబట్టే వారు మహిళలను ఒంటిరిగా బయటకు పంపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

‘‘దేశంలోని మిగతా ప్రాంతాల వారు సంప్రదాయవాదులు. వారు మహిళలను ఒంటరిగా బయటకు పంపించేందుకు ఇష్టపడరు’’. తెలంగాణలో ఆ పరిస్థితి భిన్నంగా ఉందట. ఒంటరి ప్రయాణాలకు వారు అడ్డు చెప్పరు అని మహిళా ట్రావెల్ కంపెనీ ‘వాండర్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు హెటెల్ దోషి పేర్కొన్నారు. తెలంగాణలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు తోడు(కంపెనీ) కూడా కోరుకోరని అన్నారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో కేరళ(58), తమిళనాడు(55), ఆంధ్రప్రదేశ్(53) ఉన్నాయి.

తెలంగాణలో సగటున ఓ మహిళా ట్రావెలర్ ఆరోగ్యం సంబంధ ప్రయాణాల కోసం ఏడాదికి రూ.17,470 ఖర్చు చేస్తుండగా షాపింగ్ ప్రయాణాల కోసం రూ.12,122, హాలీడేల కోసం రూ.7,311 ఖర్చు చేస్తున్నారు. ఈ
ప్రయాణాలు చాలా వరకు ఆరోగ్యం, మందులు, షాపింగ్, విహారయాత్ర తదితరాల కోసం జరుగుతున్నట్టు సర్వే పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  punjab  telangana  alone travel  

Other Articles