minister ktr sudden visits in hyderabad surprises officials

Minister ktr surprise inspections in kukatpally

Minister KTR, surprise inspections, Hyderabad, kukatpally, banjara hills, officials, city roads, jubilee hills, banjara hills, ghmc officials

Minister KTR surprise inspections in hyderabad shocks officials, ktr conducted inspections in kukatpally and jubilee hills and banjara hills.

నిషీధీ నగరంలో.. అమాత్యుల అకస్మిక తనిఖీలు..

Posted: 07/13/2016 08:45 AM IST
Minister ktr surprise inspections in kukatpally

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ అధికారులను అశ్చర్యానికి గురిచేశారు. నిషీధి నగరంలో ఆయన తన సంబంధిత అధికారులతో అకస్మిక తనిఖీలు చేశారు. ముఖ్యమంగా కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో అర్థరాత్రి తనిఖీలు చేశారు. రాత్రి 11 గం. నుంచి 2 గంటల సమయంలో ఆయన పర్యటించారు. కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో వాన నీరు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల అలసత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషా ముళ్లపూడి ప్రాంతంలోని రోడ్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. రహదారులు, ఫుట్‌పాత్‌ల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాగుబోతుల వీరంగానికి మృతిచెందిన పాప రమ్య ప్రమాదానికి గురైన బంజారాహిల్స్ చిల్లీస్ హోటల్ ప్రాంతాన్ని కూడా కేటీఆర్‌ పరిశీలించారు. వర్షా కాలంలో రోడ్లు నరకంలా మారుతున్నాయని, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తగ్గించాలని ఆయన సూచించారు. పనులు సకాలంలో పూర్తిచేయకపోతే తగిన చర్చలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. నగరంలో తరచూ కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ అధికారుల్లో దడ పుట్టిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వదలి ప్రజల మంచి కోసం తోడ్పాటు కావాలని కేటీఆర్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister KTR  surprise inspections  Hyderabad  kukatpally  banjara hills  officials  city roads  

Other Articles