32-yr-old pan seller marries 60-yr-old widow after caught in compromising position

A romance for the ages 32 yr old pan seller marries 60 yr old widow

32-yr-old man, 60-yr-old widow, marriage, muzaffar nagar, gram panchayat, Sushil Kumar, 32, and Sushila, 60-year-old widow marries32-year-old pan shop owner, compromising position, Pan seller, Muzaffarpur district, Hattha

A local panchayat in the Muzaffarpur district of north Bihar ordered a 60-year-old widow and her lover, a 32-year-old pan shop owner, to get married after the unusual couple was caught in a “compromising” position

ఇదో విచిత్ర పరిణయం.. 60ఏళ్ల మహిళతో..

Posted: 07/13/2016 07:52 AM IST
A romance for the ages 32 yr old pan seller marries 60 yr old widow

రెండు రోజుల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ 27 మహిళతో 17 ఏళ్ల బాలుడు ఏకంతంగా గడిపేందుకు ఢిల్లీలోని హోటల్ కు వెళ్లి పోలీసులకు చిక్కి సంచలనంగా మారిన ఘటనను ఢిల్లీవాసులతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఘటనను మరువక ముందే అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో 32 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకున్నారు. పక్కపక్కనే వుంటూ వ్యాపారాలు నిర్వహించుకునే వీళ్ల మధ్య పరిచయం కాస్తా పరిణయానికి దారి తీసింది.

ఇంకేముంది, మంచి శుభముహూర్తాన వీరిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. అరు పదుల వయస్సున్న ఓ మహిళను మూడు పదల వయస్సున్న యువకుడి వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వరుడు సుశీల్ కుమార్ పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. వధువు సుశీల అతడి షాప్ పక్కనే తినుబండారాలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. కాగా ఇద్దరికీ ఇదే వరకు పెళ్లయ్యింది. సుశీల్కు ఇద్దరు పిల్లలుండగా, సుశీల వితంతువు.  

ఇరుగుపొరుగు వారైన సుశీల్, సుశీల కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు స్థానికులు చెప్పారు. ఇటీవల వీరిద్దరూ అభ్యంతరకర పరిస్థితిలో పట్టుబడ్డారు. ఇరు కుటుంబాలవారు గొడవపడ్డారు. ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. పంచాయతీ పెద్దల అనుమతితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సామాజిక పరిస్థితులు అనుమతించకపోయినా ఇద్దరూ వేరుగా ఉండటానికి ఇష్టపడటంలేదని పంచాయతీ పెద్ద సునితా కుమారి చెప్పారు. గత శనివారం పంచాయతీ పెద్దల సమక్షంలో వీరిద్దరికీ పెళ్లి చేశారు. కాగా పెళ్లయిన అనంతరం వీరిద్దరూ గ్రామాన్ని వదిలి గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles