ఫేస్ మారినా ఫేట్ అస్సలు మారదు | face change but not fate of Congress in UP elections

Face changed but not fate of congress in up elections

Dinesh Sharma satires on Congress, priyanka gandhi as election head, Congress in Uttar Pradesh, face Changed not fate

BJP leader Dinesh Sharma satires on Congress for choosing priyanka gandhi as election head, said there is nothing left for the Congress in Uttar Pradesh.

ఫేస్ మారినా ఫేట్ అస్సలు మారదు

Posted: 07/06/2016 12:13 PM IST
Face changed but not fate of congress in up elections

సెమీపైనల్స్ గా అభివర్ణిస్తూ... దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేయగలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలపై ఆయా పార్టీలకు కీలక నిర్ణయాలు తీసుకునే తరుణం ఆసన్నమైంది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చే్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి వరుస ఘోర పరాజయాలు చవిచూస్తున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే బీజేపీ హవా, స్థానిక పార్టీల బలం ముందు అది చెల్లుతుందా అన్నది కొంచెం అనుమానమే. అయినా సరే ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తిరిగి పునర్వైభవం సాధించాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ యోచిస్తోంది.

ఇందుకోసం ప్రజలు మరో ఇందిరా గాంధీలా భావిస్తున్న ప్రియాంకా గాంధీకి ప్రచార బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం ఆమె కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి కూడా. అయితే తమ పార్టీ సారథి విషయంలో కాస్త వెనకబడి ఉన్న బీజేపీ అప్పుడే విమర్శలు మాత్రం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి దినేశ్ శర్మ ఆసక్తికర కామెంట్లు చేశారు.

యూపీలో కాంగ్రెస్ ఏ ‘ముఖం’ పెట్టుకుని వచ్చినా ఫలితాల్లో మాత్రం పెద్దగా తేడా ఉండదని వ్యాఖ్యానించారు. ‘‘ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ ట్రంప్ కార్డుగా వాడుతోంది. గతంలో సోనియా గాంధీ విఫలమయ్యారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ వచ్చారు. తాజాగా ప్రియాంకా గాంధీ వస్తున్నారట. అంటే రాహుల్ గాంధీ ఫెయిల్ అయినట్లు వారే స్వయంగా ఒప్పుకున్నట్లయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఆశతోనే జీవిస్తోంది. ఆ ఆశతోనే పతనమౌతుంది కూడా. అంటూ చెప్పారు. ఏదేమైనా యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరోమారు భంగపాటు తప్పదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Dinesh Sharma  Congress  UP elections  Sonia Gandhi  Rahul Gandhi  Priyanka Gandhi  

Other Articles