అద్వానీ మిస్సింగ్ అందుకేనా? Due to sister's ill-ness Advani skips Cabinet swearing ceremony

Reason for advani skips cabinet swearing ceremony

Advani absent for cabinet expansion, sister's ill-ness reason for Advani absent for Cabinet expansion

Due to sister's ill-ness Advani skips Cabinet swearing ceremony.

అద్వానీ మిస్సింగ్ అందుకేనా?

Posted: 07/06/2016 11:54 AM IST
Reason for advani skips cabinet swearing ceremony

అతిపెద్ద క్యాబినెట్ కొలువుదీరిన వేళ కీలక నేతలంతా ఆ కార్యక్రమంలో సందడి చేశారు. కానీ, కమలం కురువృద్ధుడు, లాల్ కృష్ణ అద్వానీ మాత్రం కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో మోదీపై ఉన్న కోపం ఇంకా తీరలేదని, అందుకే ఆయన ఎగ్గోట్టారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే రాష్ట్రపతి భవన్ లో ఈ మెగా ఈవెంట్ కు ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులతో పాటు బీజేపీ ముఖ్య నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వానాలు అందిన వారిలో అద్వానీ కూడా ఉన్నారు.

అయినా ఆయన హాజరుకాలేదు. దీంతో ముసలంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఆయన రాకపోవటానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఉంటున్న అద్వానీ సోదరి షీలా ఆరోగ్యం నిన్న ఆకస్మికంగా విషమించిందట. దీంతో ఆమెను అక్కడి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అద్వానీ హడావుడిగా ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి వచ్చిందట. ఆ కారణంగానే ఆహ్వానం అందినా అద్వానీ కేబినెట్ విస్తరణకు హాజరుకాలేకపోయారని ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చుకున్నారు.

ఇక ఆహ్వానం అందినా హాజరు కానీ మరో నేత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. అయితే ఆమె గైర్హాజరీకి కారణాలు సరిగ్గా లేవనే వాదన వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Modi  cabinet  Reshuffle  Advani  absent  

Other Articles