Flipkart delivery boy replaces 12 iPhones with fake ones

Delivery boy cheating flipkart arrested

Flipkart, Flipkart Scam, iPhones, Fake iPhones, Flipkart delivery, Flipkart Delivery Agent, Naveen, washerman peta, Tamilnadu, mangoes, bricks, Rs 5 lakh worth mobile phones

With the reports of customers getting mangoes and bricks, Flipkart investigated on the issue and found out that delivery boy has cheated by replacing the genuine iPhone with fake ones

కంపెనీకి కన్నం.. కస్టమర్లకు సున్నం..

Posted: 07/05/2016 09:59 AM IST
Delivery boy cheating flipkart arrested

తాను పనిచేస్తున్న సంస్థ ఆరుకాలాల పాటు చల్లగా వుండాలని, అప్పుడే తాము కూడా చల్లగా వుంటామన్నది సత్యం. అలా అలోచించే ఉద్యోగులు వారి ధోరిణిలో ఎలాంటి మార్పులు రాకుండా.. స్వల్పకాలికి ఒడిదొడుకులు వచ్చినా.. వాటిని చక్కగా అధిగమించేస్తారు. అయితే అలా కాకుండా కంనెనీలకు కన్నం వేసి.. వాటిని నమ్ముకున్న కస్టమర్లకు సున్నం పెట్టే ప్రబుద్దుల ఆటలు ఎంతోకాలం మనసాగవన్నది కూడా నిజం. అలాంటి తిన్నింటి వాసాలు లెక్కిట్టిన ఘనులు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు.

నాలుగు నెలల క్రితం నవీన్ కుమార్ అనే బీకాం చదివిన ఓ ఘనుడు ఆన్‌లైన్ సంస్థలో డెలివరీ బాయ్ గా చేరాడు. అంతే ఇక తన చేతివాటానికి పనిచెప్పాడు. అన్ లైన్ లో అందమైన మొబైల్ ఫోన్లను ఆర్డర్ చేస్తే వాళ్లకు రాళ్లను ఇచ్చాడు. మరో విలువైన వస్తువును కొనుగోలు చేస్తే వారింటికి మామిడి పండ్లు చక్కగా ప్యాక్ చేసి పంపాడు. అయితే ఇదంతా అన్ లైన్ కంపెనీ చేస్తున్న మోసం అనే భావించారు కస్టమర్లు. కానీ ఇదంతా డెలివరీ ఏజెంట్ల చేతివాటమని తెలుసుకుని అవ్వాక్కయ్యారు.

ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డెలివరీ ఏజెంట్ గా చేరిన నవీన్ ఐఫోన్ల దగ్గర్నించి అనేక రకాల ఫోన్లను మాయం చేశాడు. వాటి స్థానంలో డమ్మీ చైనా ఫోన్లను పెట్టి సంస్థను, కస్టమర్లను మోసం చేస్తున్నాడు. అయితే ఆఫోన్లను అందుకున్న కస్టమర్లు ఫోన్లు బాగోలేదని వాటిని రిటర్న్ చేస్తున్నారని తిరిగి వాటిని సంస్థకు పంపించేవాడు. ఇలా పలుమార్లు ఒకే ప్రాంతం నుంచి వస్తువులు రిటర్న్ వస్తుండటంతో అనుమానం వచ్చిన యాజమాన్యం విచారణ చేసింది. డెలివరీ ఏజెంట్‌ను పోలీసులకు అప్పచెప్పింది.
 
చెన్నైలోని వాషర్‌మెన్ పేట ప్రాంతానికి డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తాడు 21 ఏళ్ల నవీన్. ఇతనే తెలివిగా ప్లాన్ చేసి ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసింది. డెలివరీ చేసే బాయ్స్‌తో కూడా అబద్దాలు చెప్పించేవాడు. అయితే ఇతను ఇలా చేయడం ఇదే మొదటిసారి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఫ్రెండ్స్ వద్ద చేసిన అప్పులను తీర్చేందుకే అలా చేసినట్టు విచారణలో పేర్కొన్నాడు. అయితే ఒక లాయర్ ఇచ్చిన సలహా ప్రకారమే తాను ఈ ప్లాన్‌ను అమలు చేసినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఇతని వద్ద నుండి దొంగిలించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ 5లక్షలకు పైబడి ఉంటుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flipkart  Flipkart Scam  iPhones  Fake iPhones  Flipkart delivery  Flipkart Delivery Agent  

Other Articles