వైఫ్ తో లైఫ్ పోగొట్టుకున్నాడు... ఎలా? | Husband gets crushed under wife died both

Husband gets crushed under wife died both

husband gets crushed under 128kg wife, manjula Natwar lal, Over weight wife kills husband

Couple dies as husband gets crushed under 128kg wife in Rajkot.

వైఫ్ తో లైఫ్ పోగొట్టుకున్నాడు... ఎలా?

Posted: 07/05/2016 10:21 AM IST
Husband gets crushed under wife died both

భరించేవాడు భర్త అంటాడు. కానీ, పెను భారం అయితే పరిస్థితి ఏంటీ? సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భార్య భారన్ని మోయలేక ఇక్కడో వ్యక్తి తనువు చాలించాడు. తన కొడుకుకు ఏమైయి పోతుందో అన్న కంగారులో హడావుడి పడ్డ ఆమె తొందర తనతోపాటు భర్తను కూడా చిదిమేసింది. వింతైన ఈ ప్రమాదం గుజరాత్ రాజ్ కోట్ లో చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళ్లితే... రామ్ దామ్ సోసైటీలో నట్వర్ లాల్, మంజుల అనే దంపతులు ఉంటున్నారు. వీరికి అశిష్ అనే కుమారుడు. నిషా అనే అమ్మాయితో పెళ్లి కూడా అయ్యింది. అదే ఇంట్లో ఈ యువజంట పై ఫ్లోర్ లో ఉంటున్నారు. కాగా, ఈ మధ్య అశిష్ తరచూ శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదురుకుంటున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి కూడా అదే సమస్య వచ్చింది. దీంతో కంగారు పడ్డ నిషా విషయాన్ని అత్తమామల దృష్టికి తీసుకెళ్లింది.

కొడుక్కి ఏమైపోతుందోనన్న కంగారులు ఆ దంపతులు హడావుడిగా మెట్లెక్కటం ప్రారంభించారు. ఈ క్రమంలో మంజులు కాలు జారీ వెనకే వస్తున్న భర్తపై పడింది. ఇద్దరు మెట్ల మీద నుంచి పడిపోవటంతో తలకు గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 128 కేజీల బరువున్న మంజుల నట్వర్ పై పడటంతో ఊపిరాడక మృతి చెందగా, మెట్ల మీద నుంచి పడి తలకు గాయాలై మంజుల చనిపోయినట్లు నిర్థారణ అయ్యింది. వింత ప్రమాదంలో దంపతులు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajkot  Husband  Crushed  wife  over weight  

Other Articles