Commandos storm Dhaka restaurant; 6 attackers dead, 13 safe

Bangladesh hostage crisis ends after commando operation

bangladesh, dhaka attack, gunfire at dhaka, dhaka terror attack, holey artisan bakery attack dhaka, terror attack bangladesh, terror news, gunmen attack at holey artisan bakery in bangla desh, latest news, world news

6 militants killed in Dhaka restaurant, 13 hostages safe; main building of upscale Dhaka restaurant cleared.

ఢాకాలో ముగిసిన కమాండోల కౌంటర్ అటాక్

Posted: 07/02/2016 11:21 AM IST
Bangladesh hostage crisis ends after commando operation

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ముష్కరులపై గత పదకొండు గంటలుగా సాగిన కమాండోల కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. ఈ అపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టగా, 7గురిని సజీవంగా అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోని విదేశీయులే లక్ష్యంగా విరుచుకుపడ్డ ఉగ్రవాదుల నుంచి బంధీలను విముక్తి కల్పించారు. గత రాత్రి తొమ్మిది గంటల సమయంలో బెకరీలోకి చోచబడిన సాయుధ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి.. బెకరీలోని వారందరినీ బంధీలుగా చేసుకున్న విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని దౌత్య కార్యాలయాలున్న గుల్షాన్ ప్రాంతంలోని హోలి ఆర్టిసార్ బేకరిలోకి దూసుకెళ్లిన ఉగ్రవాదులు గత కొద్ది గంటలుగా దేశ భద్రతా దళాలకు సవాల్ విసిరారు. ఉగ్రవాదుల దాడుల్లో మొత్తం ఏడుగురు చనిపోగా 30 మందికిపైగా  గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే వుంది. బేకరీలోని 60 మందిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు షరతులు విధించారు. అయితే వేగంగా రంగంలోకి దిగిన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ఉగ్రవాదుల పీచమణిచింది. ఉగ్రవాదుల చెరలోని వారినందరినీ సురక్షితంగా విడిపించింది.

కాగా ఏడు, లేక ఎనమిది సాయుధ ఉగ్రవాదలు అని భావించినప్పటికీ మొత్తం 13 మంది ఉగ్రవాదులు బెకరీలోకి చెరబడ్డారని అధికారులు వెల్లడించారు. వారిలో ఆరుగురిని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మట్టుబెట్టేసింది. ఇంకో ఏడుగురు తీవ్రవాదులను సజీవంగా పట్టుకోగలిగింది. అయితే ఈ దాడికి పాల్పడింది మేమంటే మేమంటూ రెండు ఉగ్రవాద సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పాటు అల్ ఖైదా ఉద్రవాదులు కూడా ఈ కాల్పుల ఘటనకు తామే కారణమంటూ వేర్వురు ప్రకటనలిచ్చాయి.

మనోహర్

ఢాకా రెస్టారెంట్పై ముష్కరదాడి.. బంధీలుగా 60 మంద

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorists  Dhaka cafe and bakery  Gun battle  diplomatic quarter  60 people hostage  

Other Articles