బెంగళూర్ హైవేని వణికించిన అరుణక్క! | DK Aruna Demands Gadwal as district blocking bangalore highway

Dk aruna demands for gadwal as district blocking bangalore highway

Telangana Congress MLA DK Aruna, DK Aruna for Gadwal separate district, DK Aruna Bangalore highway

Telangana Congress MLA DK Aruna addressing a public rally in the constituency, has demanded TRS Government to make Gadwal a separate district.

బెంగళూర్ హైవేని వణికించిన అరుణక్క!

Posted: 07/01/2016 12:00 PM IST
Dk aruna demands for gadwal as district blocking bangalore highway

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఈ అంశం అవసరం లేకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి తెచ్చారని వాదిస్తోంది. అయితే ఆ మంత్రాలేవీ ఫలించకపోవటంతో ఇప్పుడు పరోక్షంగా వేరే ఉద్యమాన్ని తెరపైకి తెచ్చింది.

ప్రస్తుతం తమ తమ ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ దాదాపు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఉద్యమానికి తెరలేపింది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ లో గద్వాల్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను నెత్తిన వేసుకున్నారు మాజీ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే డీకే అరుణ. ఇందుకోసం విద్యార్థులను సైతం ఉద్యమంలోకి లాగుతున్నారు.

గురువారం ఎర్రవల్లి చౌరాస్తాకు చేరిన ఆమె రోడ్డుపైనే బైఠాయించారు. బెంగళూర్ హైవే కావటంతో భారీ ఎత్తున్న ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆమెను ఎంతగా సముదాయించిన ఆమె వెనక్కి తగ్గలేదంట. చివరికి స్థానిక నేతలు చోరవ చేసుకోవటంతో ఆమె అక్కడి నుంచి నిష్క్రమించారు.

గద్వాల్ ను సొంత జిల్లా చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, ఈ విషయంలో తాను ఎంతగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనేది ఆమె వాదన. ఆ మాటేమో గానీ నాలుగున్నర గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో ప్రజలు నరకయాతన అనుభవించారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  MLA DK Aruna  Gadwal  Telangana districts  

Other Articles