భారత్ ను బీట్ చేసిన పాక్... ఎందులో తెలుసా? | Pakistan overtakes India in Swiss black money

Pakistan overtakes india in swiss black money

Pakistan swiss bank, India Swiss bank, India Swiss black money, Pak swiss black money, Pak overtakes India in Swiss black money

Pakistan overtakes India in Swiss black money.

భారత్ ను బీట్ చేసిన పాక్... ఎందులో తెలుసా?

Posted: 07/01/2016 12:47 PM IST
Pakistan overtakes india in swiss black money

దాయాది దేశాలకు ఆటల్లోనే కాదు అభివృద్ధిలోనూ పోటీయే. పట్టుమని మనలో ఐదో వంతు జనాభా కూడా లేని పాక్ కి ఆ విషయంలో ఎప్పుడూ భంగపాటే ఎదురవుతుంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం మన రికార్డును ఒకదాన్ని పాకిస్థాన్ బద్ధలుకొట్టిందండోయ్...

నల్ల ధనం దీన్నే ప్రధానాంశంగా చేసుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. నెలలోపు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వెనక్కి రప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆపై మాట తప్పింది. రెండేళ్లయినా అందులో ఏ మాత్రం పురోగతి లేదు. కానీ, ఆ హెచ్చరికలు మాత్రం బాగా పని చేశాయి. అక్రమ బాబులు ప్రస్తుతం అక్కడ డబ్బు దాచుకునేందుకు సాహసం చేయలేకపోతున్నారు. వెరసి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్ల ధనం మూటలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

అయితే ఆ లోటును పాక్ ఇప్పుడు పూడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ బ్యాంకుల్లో మన సొమ్ముకన్నా పాక్ డబ్బే ఎక్కువగా ఉన్నట్లు సమచారం. 2014తో పోలిస్తే స్విస్ బ్యాంకుల్లో పాక్ నల్ల ధనం గతేడాది 16 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం భారతీయులకు చెందిన సొమ్ము కేవలం రూ.8 వేల కోట్ల లోపే ఉందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  swiss bank  black money  

Other Articles