10 రోజులు బ్యాంకులన్నీ బంద్ | Banks to be closed for 10 days in July

Banks to be closed for 10 days in july

Banks to be closed for 10 days, banks strike for 2 days, All India Bank srike, bank strike in India

Banks to be closed for 10 days in July.Banks will be closed for an unprecedented 10 days, including five Sundays, two Saturdays, Id and 2 days owing to strike by different employees’ union of banks across the country.

10 రోజులు బ్యాంకులన్నీ బంద్

Posted: 07/01/2016 11:24 AM IST
Banks to be closed for 10 days in july

దేశంలో ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడనుంది. జూలై నెలలో 10 రోజులు బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసులను కూడా ప్రభుత్వానికి అందజేశాయి. అయితే కేవలం రెండు రోజులు మాత్రమే.

పది రోజుల్లో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు, రంజాన్ పండుగ, రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో కలుపుకుని మొత్తం పదిరోజులు సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో వినియోగదారులకు అసౌకర్యంతోపాటు, లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తోంది. అంతేకాదు ఏటీఎం నుంచి నగదు డ్రా చేసే విషయంలోనూ ఇబ్బందులు తలెత్తవచ్చు.

అయితే ఈ నెలలో ఎనిమిది రోజులు సాధారణ సెలవు దినాలే కాబట్టి ప్రభావం చూపే అవకాశం లేదని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెబుతున్నారు. ఏటీఎంల విషయంలోనూ ఎలాంటి అసౌకర్యం కలగదని ఆయన అంటున్నారు. అయితే బ్యాంకులకు నేరుగా వెళ్లి డబ్బులు డ్రా చేయడంతోపాటు ఇతర లావాదేవీలు నిర్వహించే వారిపై సెలవుల ప్రభావం కొంత వరకు ఉంటుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banks  holidays  10 days  july 2016  

Other Articles

Today on Telugu Wishesh