Rashtrapati Bhavan Geared Up Ahead Of PM Modi’s Cabinet Reshuffle

Pm narendra modi s cabinet reshuffle on thursday

Minority Affairs Minister Najma Heptulla, Union Minister of State Nihal Chand, MoS for Agriculture and Farmers Welfare, Sanjeev Balyan, independent charge, new delhi, modi government, narendra modi, rashtrapati bhavan, union cabinet, cabinet reshuffle, politics, latest news

Rashtrapati Bhavan is being readied ahead of Prime Minister Narendra Modi’s Cabinet reshuffle, which is likely to take place on Thursday.

కేంద్ర క్యాబినెట్ లో మార్పులు.. నజ్మా, నిఖిల్ చంద్ లకు పదవీ గండం.?

Posted: 06/29/2016 01:06 PM IST
Pm narendra modi s cabinet reshuffle on thursday

రాష్ట్రపతి భవనంలోని అశోకా హాల్ సుందరంగా ముస్తాబవుతోంది. ఎందుకో మీకు అర్థమయ్యే వుంటుంది. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని రేపు పునర్ వ్యవస్థీకరించబోతున్నారని సమాచారంతో దేశప్రజలు అసక్తిగా కనబరుస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు ఎలా వుండబోతున్నాయన్న అంశంపై సర్వత్రా అసక్తి రేపుతుంది. అయితే కీలక శాఖలలో ఎలాంటి మార్పులు, చేర్పులు మోడీ సర్కార్ చేపట్టడం లేదని సమాచారం.

అయితే ప్రాంతాల వారీగా తమ మిత్రపక్షాలతో సమతుల్యత పాటించడంతో పాటు కులాల వారీగా కూడా సమతుల్యంగా వుండేందుకు మోడీ తన క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ప్రాంతీయ, కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం జరిగే కార్యక్రమం తర్వాత అతిథులకు విందు ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం గురువారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించవలసిన మంత్రివర్గ సమావేశాన్ని సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.
 
కేంద్ర మైనారిటీ వ్యవహరాల శాఖా మంత్రి నజ్మా హెప్తుల్లాతో పాటు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి నిహాల్ చంద్‌లకు పదవీ గండం ఉందన్న వార్తలు వినబడుతున్నాయి. రాజస్థాన్ నుంచి సీనియర్ నేత అర్జున్ మేఘ్‌వాల్‌ను పదవి వరించబోతోందంటున్నారు. అదేవిధంగా జబల్‌పూర్ ఎంపీ రాకేష్ సింగ్, అస్సాంలోని మంగల్‌దోయ్ ఎంపీ రామన్ డేకా, బీజేపీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధి మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారని తెలుస్తోంది. అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్‌ను మంత్రివర్గంలోకి చేర్చుకుంటారని ఊహాగానాలు వస్తున్నాయి. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి శర్వానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మంత్రి పదవి ఖాళీ అయింది. సాంఘికన్యాయం, సాధికారత శాఖ నుంచి పంజాబ్ బీజేపీ చీఫ్‌గా నియమితుడైన విజయ్ సంప్లాను తప్పిస్తారని చెబుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra modi  rashtrapati bhavan  union cabinet reshuffle  najma heptulla  

Other Articles