వైసీపీ నేతపై అత్యాచారయత్నం? | rape attempt on Guntur YSRCP leader

Rape attempt on guntur ysrcp leader

Rape attempt on Guntur YSRCP leader, Rape attempt on YSRCP woman leader, YSRCP woman leader rape, Minister behind Rape attempt on Guntur YSRCP leader, మంత్రి ప్రమేయంతో రేప్, వైఎస్సార్పీపీ నేతపై రేప్, తెలుగు వార్తలు, ఏపీ వార్తలు, గుంటూరు వైసీపీ మహిళా నేత, మహిళా నేత రేవతిపై అత్యాచారయత్నం

Rape attempt on Guntur YSRCP leader. Minister involved in this issue.

వైసీపీ నేతపై అత్యాచారయత్నం, మంత్రి ప్రమేయం?

Posted: 06/28/2016 12:52 PM IST
Rape attempt on guntur ysrcp leader

వలసలతో బిజీగా ఉన్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలో సోమవారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. గుంటూరు జిల్లా పరిషత్ లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మహిళా నేత తనపై అత్యాచార యత్నం జరిగిందంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో ఆమె సొంత పార్టీ నేతపైనే ఫిర్యాదు చేయటం విశేషం.

గుంటూరు జిల్లా మణిపురం గ్రామంలోని వైసీపీ మహిళా నేత ఇంటి వద్ద ఓ జడ్పీటీసీ గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ జడ్పీటీసీని నుంచి పూర్తి వివరాలను పోలీసులు సేకరించారు. అంతలో పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన వైసీపీ మహిళా నేత తనపై అత్యాచార యత్నం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే రక్తమోడుతున్న గాయాలతో ఆసుపత్రి బెడ్ పైకి చేరిన జడ్సీటీసీ మాత్రం డబ్బు అడిగేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని వాపోయాడు. ఎవరి వాదన నిజమో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. ఓవైపు ఉద్యోగుల హడావుడి, అధికారుల భద్రతతో బిజీగా ఉన్న పోలీసులకు నిన్న ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందట. అయితే ఈ వ్యవహారంలో ఓ మంత్రి హ్యండ్ ఉన్నట్లు తెలియటంతో బయటకు రావటంతో గోప్యతను ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాదికారుల స్పందన కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape attempt  Guntur YSRCP leader revathi  rape attempt on YSRCP revathi  

Other Articles

Today on Telugu Wishesh