Drunk woman slaps cop in Mumbai police station

Drunk nigerian woman creates ruckus in bengaluru

Nigerian woman, rampage, National Market, Gandhinagar, KC General Hospital, girl slaps policeman, mumbai cop slapped, drunk girl mumbai, drunk girl mumbai police station, police office slapped, mumbai cop slapped, crime

High drama ensued as two woman create ruckus one in bengaluru and other in mumbai. In first incident a woman in a market area in Bengaluru claimed to be a Nigerian national and her companion created ruckus and in other indian woman in drunken stage creates ruckus an assulted 3 woman conistables in police station.

ITEMVIDEOS: వీళ్లు అమ్మాయిలేనా..? పోలీసులను ఠారెత్తిస్తారా.?

Posted: 06/28/2016 12:54 PM IST
Drunk nigerian woman creates ruckus in bengaluru

నండూరి ఎంకిలా, బాపు గారి గీతలా అచ్చ తెలుగు పదహారణాల తెలుగమ్మాయి గురించి చెప్పతుంటే యావత్ ప్రపంచం సంభ్రమాశ్చర్యంలో మునిగి తేలాల్సిందే. అయితే అమ్మాయి అన్న పదానికి పరాకాష్టగా నిలిచేలా కొందరు అమ్మాయిలు వ్యవహరిస్తున్న తీరుతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఒక స్వదేశీ అమ్మాయితో పాటు ఒక విదేశీ అమ్మాయి మద్యానికి బానిసలై.. మత్తులో జోగుతూ.. వారేం చేస్తున్నారో.. అన్న విషయాన్ని మర్చి ఏకంగా వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులనే ఠారెత్తించారు.

mumbai

వివరాల్లోకి వెళ్తే.. మద్యం మత్తు తలకెక్కిన ఓ ముంబై యువతి పోలీస్ స్టేషన్ సాక్షిగా రచ్చ రచ్చ చేసింది. తన నలుగురు భాయ్ ప్రెండ్స్ తో కలసి పీకలదాక మద్యం సేవించి.. కారును రాష్ గా డ్రైవ్ చేస్తూ అదే మత్తులో అదే రోడ్డున వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. కారును ఆపకుండా ముందుకు సాగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటబడి ఆమెను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా.. 'నన్నే అరెస్ట్ చేస్తారా?' అంటూ పోలీస్ స్టేషన్ లో బూతు పురాణం మొదలుపెట్టింది.

అక్కడ కుర్చీల్లో కూర్చున్న ఆరుగురు పోలీసులను వరుసగా చెంప దెబ్బలు కొట్టింది. అమెను నిలువరించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళా కానిస్టేబుళ్ల చేతులను కూడా అమె కొరికారు. అసలే యువతి, ఆపై మద్యం మత్తులో ఉంది... నిలువరించేదెలాగంటూ పోలీసులు నానా పాట్లు పడ్డారు. ఒకానొక సందర్భంలో ఆ యువతి నుంచి దెబ్బలు తప్పించుకునేందుకు పోలీసులు స్టేషన్ లోనే పరుగులు పెట్టారు. ఇక ఆమెను నిలువరించేందుకు రంగంలోకి దిగిన ఆమె నలుగురు స్నేహితులు ఎలాగోలా ఆమెను శాంతింపజేశారు.

ఇక మరో ఘటనలో బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్, ప్రభుత్వ అస్పుపత్రి వద్ద 25 ఏళ్ల పైబడిన ఓ విదేశీ యువతి చేసిన రచ్చ దేశవ్యాప్తంగా మరింత కలకలం రేపింది. ఫుల్లుగా డ్రగ్స్ తీసుకొన్న నైజీరియన్ యువతి బెంగళూరు వీధుల్లో నానా రచ్చ చేసింది. మగాడిలా ప్యాంటు, టీ షర్ట్ తో రోడ్డుమీదకు వచ్చిన నైజీరియన్ యువతి తడబడుతూ నడుస్తోంది. ముందుగా ఓ షాపింగ్ మాల్లోకి వెళ్లిన యువతి అక్కడి సామాన్లు నేలకేసి కొట్టడమే కాకుండా వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. షాపింగ్ మాల్ సిబ్బంది అమెను నిలువరించే ప్రయత్నం చేసి విఫలం కావడంతో.. వారు పోలీసులకు పిర్యాదు చేశారు.

రంగంలోకి దిగన పోలీసులు అమెను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ఒక్కసారిగా ఎదురు తిరిగింది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను బంధించేందుకు యత్నించగా, వారి యత్నాన్ని విఫలం చేసేందుకు ఆ యువతి కింద పడిపోయింది. కాళ్లతో పోలీసులను తంతూ నానా బీభత్సం చేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఓ పోలీసు అధికారి ఆమెకు వాస్తవ పరిస్థితిని వివరించబోయారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె సదరు పోలీసు అధికారిపై ఏకంగా దండయాత్ర చేసే రీతిలో దూసుకురాగా అయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అమెను నిలువరించేందుకు చేతులు కట్టేసిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nigerian Woman  Ruckus  Bengaluru Market  crime  

Other Articles