ఫస్ట్ లేడీ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య | First Female Cab Driver of Bangalore Found Dead

First female cab driver of bangalore found dead

First Female Cab Driver of India, First Female Cab Driver of Bangalore, Female Cab Driver Bharathi Veerath, Bharathi Veerath suicide, Female Cab Driver

First Female Cab Driver of Bangalore Bharathi Veerath Found Dead.

ఫస్ట్ లేడీ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

Posted: 06/28/2016 12:45 PM IST
First female cab driver of bangalore found dead

భారతి వీరత్... రెండేళ్ల క్రితం ఈ పేరు కర్ణాటక పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో కనిపించిన పేరు. బెంగళూరుకు చెందిన ఫస్ట్ క్యాబ్ డ్రైవర్ గా ఆమె రికార్డు సృష్టించింది. కట్ చేస్తే ఇప్పుడు కూడా ఆమె పేరు ఫస్ట్ పేజీలోనే వచ్చింది. కానీ, విగతజీవిగా మారి. ఈ తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది .

ఆంధ్రాకు చెందిన 39 ఏళ్ల భారతి వీరత్ పదేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లిందట. ఒంటరిగా ఉంటున్న ఆమె ఓ ఎన్టీవో తరపున మొదట్లో టైలరింగ్ నేర్చుకునేది. ఆపై మెల్లిగా డ్రైవింగ్ నేర్చుకుని బెంగళూరులోనే మొదటి మహిళా క్యాబ్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది. ఉబెర్ లో రెండేళ్లపాటు విధులు నిర్వహించిన ఆమె తాజాగా తిరిగి ఏపీకి వెళ్లిపోదామని డిసైడ్ అయ్యిందట.

అయితే ఆదివారం నుంచి కనిపించకపోవటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని ఆమె ఉంటున్న పోర్షన్ వద్దకు వెళ్లి చూశాడంట. చున్నీలాంటిదానితో ఉరి వేసుకొని ఆమె వేలాడుతూ కనిపించింది. కాగా, సూసైడ్ కి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్ మార్టం అనంతరం ఆంధ్రాలోని బంధువులకు ఆమె మృతదేహం అప్పజెప్పనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : First Female Cab Driver  Bangalore  Bharathi Veerath  suicide  

Other Articles