AirAsia unveils promo fares for one-way domestic trips

Airasia announces kabali promotional fares

Rajnikanth, Kabali, AirAsia, ticket prices, discount offer, domestic destinations, Fly like a Superstar offer, bengaluru, new delhi, Amar Abrol, special promotional fares

AirAsia is announcing an exclusive 'Fly like a Superstar' promotion which features all-in-fares from Rs 786 one-way to domestic destinations in India.

ఎయిర్ఏషియా ‘కబాలి’ డిస్కౌంట్ ఆఫర్

Posted: 06/28/2016 09:52 AM IST
Airasia announces kabali promotional fares

ప్రముఖ చౌకదర విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సినిమాలకు ప్రభావితం అయ్యంది. ఎవరైనా సినిమాలు చూస్తారు కానీ వాటికి ప్రభావితమై.. డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తారా.? అంటే సాథ్యం అయ్యే పనికాదని అందరూ అభిప్రాయపడతారు. అయితే తమకు తోచిన విధంగా తాము సాయం చేస్తారు కానీ, సంస్థపరంగా రాయితీలను ప్రకటించిడం అత్యంత అరుదు. అయితే ఇలాంటి అరుదైన ఘటనకు తెరతీసింది చౌకధర విమానయాన సంస్థ ఏయిర్ ఏషియా.

దక్షిణాధి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా త్వరలో విడుదల కానున్న కబాలి చిత్రానికి సంబంధించి.. ఈ ఎయిర్ లైన్స్ ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్ అనే కాప్షన్ తో దేశీయంగా వన్ వేకు మాత్రమే రాయితీతో కూడిన అఫర్ ను ప్రకటించింది. తాజాగా వన్ వే ప్రయాణానికి టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్‌ను (ఒకవైపునకు మాత్రమే) రూ.786 ప్రారంభ ధరతో అందిస్తోంది. ‘ఫ్లై లైక్ ఏ సూపర్‌స్టార్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్.. జూలై 3 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలియజేసింది. దీంతో పాటు అటు పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. అంతర్జాతీయంగా ఒకవైపునకు సంబంధించి రూ.2,999 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. రజనీకాంత్ మూవీ ‘కబాలి’ ప్రమోషన్స్‌లో భాగం గా సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌ఏషియా ఇటీవలే కబాలి సినిమా నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles