గోమూత్రం నిజంగానే బంగారం | gold found in Gir cows urine

Gold found in gir cows urine

gold in the urine of Gir cows, gold fond in cow urine, cow urine real gold, ఆవు మూత్రం నిజంగా బంగారం, గోమూత్రం గోల్డ్, గిర్ ఆవుల మూత్రంలో గోల్డ్, తాజా వార్తలు, national news, gir cows urine, cows urine in India

Scientists at Junagadh Agricultural University (JAU) have actually found gold in the urine of Gir cows. The precious metal was found in ionic form, which is gold salts soluble in water.

గోమూత్రం నిజంగానే గోల్డెహే!

Posted: 06/28/2016 10:06 AM IST
Gold found in gir cows urine

సాధు జంతువు ఆవును తమ అవసరాల కోసం వాడుకుంటూ మత రాజకీయాలు చేసే వారు మన దగ్గర ఉన్నారు. వారి మాట అటుంచి అసలు హిందువులు మాత్రం సాంప్రదాయ పద్ధతిలో ఎప్పటి నుంచో ఆవును పరమపవిత్రంగా భావిస్తున్నారు. ఆవును తాకితేనే పాపాలు పోతాయని, గోమూత్రంతో రోగాలు రావని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు ఆవు యూరిన్ ను ఔషధాల్లో కూడా వాడుతుంటారు. అయితే గోమూత్రంలో అంతకు మించిన విషయం ఉందని ఇప్పుడు సర్వేలో వెల్లడైంది.

గిర్ జాతి ఆవుల మూత్రంపై జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(జేఏయూ) నిర్వహించిన పరిశోధనలో బంగార ఉన్నట్లు వెలుగు చూసింది. సుమారు 400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం నమూనాలను జేఏయూలోని ఆహార పరీక్ష ల్యాబ్‌లో పరీక్షించగా, లీటర్ మూత్రంలో మూడు నుంచి 10 మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్టు తేలింది. బంగారం అంతా అయాన్ల రూపంలో బంగారం ఉన్నట్టు పరిశోధనకారులు పేర్కొన్నారు.

పరిశోధన కోసం గ్యాస్ క్రోమటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ(జీసీ-ఎంఎస్) పద్ధతిలో మూత్రం నమూనాలను విశ్లేషించినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ బీఏ గొలాకియా పేర్కొన్నారు. ఒంటెలు, గేదెలు, గొర్రెలు, మేకల నుంచి సేకరించిన మూత్రంపైనా పరిశోధనలు చేయగా అందులో యాంటీ బయోటిక్ పదార్థాలు కనిపించలేదన్నారు. అంతేకాదు మెడిసిన్ లో వాడేందుకు గోమూత్రానికి అన్ని అర్హతలు ఉన్నాయని వారు తేల్చారు. ఆవు మూత్రంలో బంగారం ఉంటుందని పూర్వీకులు చెప్పడం తెలసిందే. అయితే అందులో ఎంత వరకు నిజం ఉందనే విషయాన్ని తేల్చేందుకే తామీ పరిశోధన నిర్వహించినట్లు గొలాకియా తెలిపారు. సో.. ఇప్పటి నుంచి గో మూత్రాన్ని జర భధ్రంగా దాచుకోండి మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles