హల్ చల్ చేస్తున్న కేరళ బామ్మ వీడియో | Meenakshi Raghavan masters of Kalari

Meenakshi raghavan masters of kalari video viral

Meenakshi Raghavan, Kerala, Vadakara, Martial arts, Kalaripayattu

Meenakshi Raghavan, 72, is one of the few practicing masters of Kalari, an ancient martial art originating from the Malabar region of India. Raghavan is also an expert in Kalaripayattu, a Malayam style of sword fighting. Meenakshi started learning Kalari at the age of seven. She married her own guru, Mr Raghavan, who later helped her achieve unrivalled mastery in Kalaripayattu. She was seen practicing and teaching in Vadakara, in Kerala, Saturday. Meenakshi now teaches at a local temple that is deeply connected with martial arts. Dozens of children in the region seek her for guidance and mastery. The martial arts master hails from Vadakara in north Kerala.

ITEMVIDEOS:నెట్ లో కేరళ వృద్ధురాలి వీడియో... ఏముంది?

Posted: 06/23/2016 10:45 AM IST
Meenakshi raghavan masters of kalari video viral

వయసుతో సంబంధం లేకుండా ఈ బామ్మ చేస్తున్న పని చూస్తుంటే ఎవరికైనా మతిపోవటం ఖాయం. ఆరుపదులు దాటగానే పళ్లు ఊడిపోయి, నడవలేని స్థితిలో కనీసం ఊతకర్ర సాయం తీసుకునే వాళ్లం చూసుంటాం. కానీ, ఈ పెద్దావిడ 76 ఏళ్ల వయసులో ఇలా చేస్తుందంటే హాట్సాఫ్ చెప్పక మానరు. ఎందుకంటే ఈమె కృషి, పట్టుదల అలాంటిది.

వివరాల్లోకి వెళ్తే... కేరళలోని వటకార ప్రాంతానికి వెళ్తే అక్కడ మీనాక్షమ్మ అనే వృద్ధురాలు కనిపిస్తుంది. ఆమె సాదాసీదా ముసలామె అనుకుంటే పొరపాటే. కర్ర, కత్తి సాములో నాకెవరూ సాటి రారంటు ఎగురుతోంది. తన ఫీట్లతో ఈ వయస్సులోనూ వావ్ అనిపిస్తోంది. కలరియపాయత్తు అని పిలుచుకునే ఈ విద్యను ఆమె చిన్నతనం నుంచే వంటపట్టించుకుందట. క్రమం తప్పకుండా రోజూ సాధన చేస్తానని చెబుతోంది. ఈ వయసులోనూ తన ప్రత్యర్థిని మట్టి కరిపించడంలో దిట్ట. తన దగ్గరకు వచ్చేవారిని శిష్యులుగా అంగీకరించి వారికి ఈ విద్య నేర్పిస్తూ బిజీగా ఉంటుంది.

‘ఎరైజింగ్’ ఇండియా పేరిట ఆమె చేసిన కర్రసామును ఇటీవల ఒకరు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సుమారు 9 లక్షల మంది ఆ వీడియో చూశారంటే అర్థం చేసుకోవచ్చు. చీర కొంగును నడుముకి బిగించి మీనాక్షమ్మ ఓ యుక్తవయసు వ్యక్తితో చేసిన కర్రసాము చూసి మీరు అబ్బో అనకమానరు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meenakshi Raghavan  Kerala  Vadakara  Martial arts  Kalaripayattu  

Other Articles