ఫోన్ లో రూ. 20కే 100 టీవీ చానల్స్ | Ditto TV 100 channels for 20 rupees only

Ditto tv 100 channels for just 20 rupees only

Zee TV, zee tv ditto app, ditto 100 channels 20 rupees, 20కే వంద చానెళ్లు, 20 రూపాయలకే వంద చానెళ్లు, జీ గ్రూప్ డిట్టో యాప్, డిట్టో యాప్ తో వంద చానెళ్లు, జీ గ్రూప్ ఐడియా వంద చానెళ్లు, డిట్టో తో ఒక్క ఐడియా, మొబైల్ లో వంద చానెళ్లు, latest news, telugu news, budiness news, స్మార్ట్ ఫోన్ లో వంద చానెళ్లు, స్మార్ట్ ఫోన్లో 20 కే వంద చానెళ్లు

In a market with no paucity of video streaming apps, Zee Entertainment’s Ditto TV has cut its subscription fees to just Rs 20 per month, from around Rs 150 per month. The service includes over 100 TV channels, including from its parent network Zee, and others like Colors, Sony, SAB, Zoom, MTV, BBC, Times Now, MTV and Aaj Tak.

ఫోన్ లో రూ. 20కే 100 టీవీ చానల్స్

Posted: 06/23/2016 11:34 AM IST
Ditto tv 100 channels for just 20 rupees only

మార్కెట్ పోటీకి అనుగుణంగా టీవీ చానళ్ల ప్రసారాల విషయంలో ఆయా కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుండటంతో దానిని కూడా క్యాష్ చేసుకునేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. వినోద రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న జీ గ్రూపు మరో అడుగు ముందుకు వేసింది. డిట్టో టీవీ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ యూజర్లకు తక్కువ ధరకే టీవీ చానళ్ల ప్రసారాలను అందించేందుకు ముందుకు వచ్చింది.

నెలకు 20 రూపాయలకే 100కు పైగా టీవీ చానళ్ల ప్రసారాలను అందుకోవచ్చు. జీ గ్రూపు సిటీ కేబుల్, ఐడియా సెల్యులర్ నెట్ వర్క్ లతో భాగస్వామ్యం కుదుర్చుకుని డిట్టో టీవీ ప్రసారాలను అందిస్తోంది. డిట్టో టీవీ చానల్ నెలవారీ చందా 20 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. ఐడియా 3జీ, 4జీ చందాదారులు నెలవారీ డేటా ప్యాక్ తో ఉచితంగా డిట్టో టీవీ చందాదారులుగా చేరేందుకు అవకాశం కల్పిస్తోంది.

ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లపై డిట్టో టీవీ అందుబాటులో ఉంచినట్టు జీ గ్రూపు ప్రకటించింది. డిట్టో టీవీ యాప్ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా టీవీ ప్రసారాలను చూసుకోవచ్చని కంపెనీ అంటోంది. మూడు నెలలకు రూ. 50, ఆరు నెలలకు రూ.90, ఏడాది చందా రూ.170గా ప్రకటించింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zee tv group  ditto app  mobile streaming app  20 rupees hundred channels  

Other Articles