జానా మాటలు బ్రిటీషోళ్లు విన్నారంట! | britishers follows but KCR ignore janareddy suggestions

Britishers follows but kcr ignore janareddy suggestions

Janareddy, Congress Janareddy fire on KCR, T CM KCR, telangana political news, KCR congress, janareddy bayyaram mines, తెలంగాణ రాజకీయాలు, జానారెడ్డి కేసీఆర్ వార్తలు, బ్రిటీష్ వాళ్లతో జానా మాటలు, telangana political news, janareddy KCR, జానారెడ్డి మాటలు కేసీఆర్ వినలేదంట, బ్రిటీషోళ్లే జానా మాటలు విన్నారు, జానా ముందు కేసీఆర్ ఎంత, తెలుగు వార్తలు, latest news

janareddy fire on KCR about bayyaram mines. Congress Jana says britishers follow his instructions but KCR ignore.

జానా మాటలు బ్రిటీషోళ్లు విన్నారంట!

Posted: 06/23/2016 10:24 AM IST
Britishers follows but kcr ignore janareddy suggestions

రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకు పోయిన ఫర్వాలేదుగానీ తన మాటల వైఖరిలో మాత్రం మారదంటున్నాడు సీఎల్పీ నేత కందూరు జానారెడ్డి . గుత్తా, వివేక్ బ్రదర్స్ పార్టీ మారిన టైంలో ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే తన కండువాను పక్కనపడేసి అదే సీఎల్పీ పదవికి రాజీనామా చేసి మరీ ప్రజల వద్దకు వెళ్తానని ఆయన ప్రకటించారు. తమను కూర్చోబెట్టి మరీ అంత ఎమోషనల్ గా ఎందుకు మాట్లాడారో అర్థం కానీ మీడియా మిత్రులు జుట్లు పీకేసుకున్నారు.   

కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ఐదు రూపాయల భోజనం తిని శభాష్ అనటమే కాదు, తరచూ తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడుతుంటడంతో ఆయనో కోవర్టు అంటూ సొంత సీనియర్ నేత పాల్వాయి అనుమానించాడు. దీంతో ఎలాగైన తెలంగాణ సర్కార్ ను విమర్శించి తన రాజకీయ పాతివ్రత్యాన్ని నిలుపుకోవాలని జానా చూశారు. ఇందులో భాగంగా బుధవారం టీ సర్కారుపై ఆసక్తికర విమర్శలు గుప్పించారు.

జిల్లాల విభజన రాజకీయ అవసరాల కోణంలోనే జరుగుతోందంటూ విమర్శించారు. బయ్యారం గనులను దక్కించుకునేందుకు... బయ్యారం, గార్ల ప్రాంతాలను మహబూబాబాద్ లో కలిపేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బ్రిటిష్ వాళ్లే తన సలహాలు తీసుకుంటే... కేసీఆర్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా తమ సూచనలను పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.  బ్రిటిషన్ హైకమిషనర్ నిన్న హైదరాబాదులో పర్యటించిన నేపథ్యంలోనే జానారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janareddy  T congress  KCR  Bayyaram Mines  

Other Articles