ఫుట్ బోర్డు జర్నీ చేస్తే బస్ పాస్ కాన్సిల్ | TN govt cancelled student buspasses for foot board journey

Tn govt cancelled student buspasses for foot board journey

jayalalitha govt seized passes for foot board journey. to control student deaths during foot board journey jayalalitha strictly ordered RTC officials. ఫుట్ బోర్డు చేస్తే పాస్ లు సీజ్, అమ్మ ఫుట్ బోర్డు జర్నీ, జయలలిత పుట్ బోర్డు జర్నీపై సీరియస్, ఫుట్ బోర్డు చేసే విద్యార్థుల బస్ పాస్ సీజ్, తమిళ రాజకీయాలు, తమిళనాడు వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news, tamilnadyu students bus passes, jayalalitha student buspasses

Jayalalitha govt seized passes for foot board journey, to control student deaths during foot board journey jayalalitha strictly ordered RTC officials.TN govt cancelled student buspasses for foot board journey.

ఫుట్ బోర్డు జర్నీ చేస్తే బస్ పాస్ కాన్సిల్

Posted: 06/21/2016 01:30 PM IST
Tn govt cancelled student buspasses for foot board journey

కీలక వేళల్లో చాలినన్ని బస్సులు లేకపోతో ఫుట్ బోర్డు ప్రయాణం చేయటం ఎక్కడైనా సర్వసాధారణంగా కనిపించే అంశమే. కిటికీలకు వేలాడుతూ, పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు చేరుకునే ఉద్యోగులను ఇక్కడా మనం చూస్తుంటాం. అయితే తమిళనాడులో మాత్రం అదీ మరీ దారుణంగా ఉంటుంది. సమయం మించి పోతున్నదనో లేక మరేయితర కారణాలతోనో ఫుట్ బోర్డు జర్నీ చేసే వారి సంఖ్య రోజు రోజుకీ అక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా అక్కడ ఫుట్ బోర్డు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో బస్సుల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ, పట్టుబడే విద్యార్థుల బస్ పాస్ లను స్పాట్ లోనే రద్దు చేయాలని సీఎం జయలలిత ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నాడు తమిళనాడు విద్యాశాఖ నుంచి సంచాలకులకు ఉత్తర్వలు జారీ అయ్యాయి.

అయితే గతంలోనూ ఇలా ఫుట్ బోర్డు జర్నీ చేస్తూ విద్యార్థులు పట్టుబడినప్పుడు పోలీసులు కొన్ని కఠిన చర్యలు తీసుకున్నారు.  రూ. 500 జరిమానా, తల్లిదంద్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, టీసీలు ఇచ్చి పంపడం వంటి చర్యలు చేపట్టినా, అది కొంతకాలానికే పరిమితమైంది. ఇక ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ, విలువైన విద్యార్థుల ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయ సర్కారు చెబుతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TN CM jayalalitha  TN students  Foot board journey  bus passes seize  

Other Articles