తెలంగాణ గుండె చప్పుడుకు అవమానం? | KCR ignore prof jayashankar death anniversary

Kcr ignore prof jayashankar death anniversary

Telangana KCR ignore prof jayashankar death anniversary. TRS govt not intrested in jayashankar anniversary, జయశంకర్ కి అవమానం, కేసీఆర్ జయశంకర్ ని మరిచిపోయారా, తెలంగాణ జాతిపితకు అవమానం, గుండె చప్పుడు కు అవమానం, జయశంకర్ వర్థంతి పట్టించుకోని టీఆర్ఎస్, కేసీఆర్ జయశంకర్ వర్ధంతి, తెలంగాణ వార్తలు, రాజకీయాలు, తాజా వార్తలు, తెలుగు వార్తలు

Telangana KCR ignore prof jayashankar death anniversary. TRS govt not intrested in jayashankar death anniversary. TRS govt official not conducting jayashankar death anniversary.

తెలంగాణ గుండె చప్పుడుకు అవమానం?

Posted: 06/21/2016 12:40 PM IST
Kcr ignore prof jayashankar death anniversary

తెలంగాణ రాష్ట్ర అకాంక్ష కోసం, దశాబ్దాల ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెస‌ర్ కొత్తపల్లి జయశంకర్. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన దగ్గరే కేసీఆర్ తెలంగాణ గురించి అణువణువు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నో సభలో కేసీఆర్ చెప్పుకున్నారు కూడా.  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో ఆ విజయం జయశంకర్, కేసీఆర్ లదే అని గులాబీ దండు సైతం దండోరా వేసింది. ఆయన చనిపోయి నేటికి సరిగ్గా ఐదేళ్లు గడిచాయి. జూన్ 21న ఆయన వ‌ర్ధంతి అధికార పక్షం ఇప్పుడు ఏం చేస్తోంది పరిశీలిస్తే...

అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినప్పటికీ మొదటి రెండేళ్లు ఆయన వర్థంతిని ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్. ఈ సంవత్సరం ఆ విషయంలో ఎందుకనో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సభలు, పథకాలు, రెండేళ్లపాలనపై టీవీల్లో ప్రకటనల్లో ఆర్భాటాలు చేసే ప్రభుత్వానికి తెలంగాణ గుండె చప్పుడుగా అభివర్ణించే పెద్దాయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించలేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ సమయంలో పక్కనుండి గురువులా కేసీఆర్ తో ఉద్యమాన్ని నడిపించారాయన. అలాంటి వ్యక్తి విషయంలో కేసీఆర్ వైఖరి ఎందుకిలా మారిందంటూ అనుకుంటున్నారు. కనీసం ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించే తీరిక కూడా ఆయనకు లేదా అంటూ నిలదీస్తున్నారు.

రాష్ట్ర ప్రగతి కోసం కేసీఆర్ సారథ్యంలో కష్టపడుతున్నామంటూ చెప్పుకుంటున్న మంత్రులు సైతం ఈ విషయాన్ని లైట్ తీస్కోవటం ఇఫ్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు, స్థానిక నేతలు మినహా ఎవరూ ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.  మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహరావు, మరో కాంగ్ నేత పీజేఆర్ విషయంలో కనబరిచిన శ్రధ్ధ జయశంకర్ సంగతి కొచ్చేసరికి మారిందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  కొత్తలో స్ఫూర్తి సభతో హోరెత్తించిన వారు ఇప్పడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగారు తెలంగాణ కోసం బ్రహ్మచర్యం చేపట్టి అహర్నిశలు శ్రమించిన ఈ సిసలైన జాతిపితకు నివాళర్పించడంలో నిర్లక్ష్యం వహించడం కరెక్ట్ కాదంటూ పలువురు చెబుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prof jayashankar  death anniversary  telangana  CM KCR  TRS  

Other Articles