ఉడిపిలో ఘోర ప్రమాదం... 8 మంది చిన్నారుల మృతి | 8 children killed in horrific accident at Udipi

8 children killed in horrific accident at udipi

eight children killed in a horrific accident, ఉడిపిలో స్కూల్ బస్సు ఓమ్ని వ్యాన్ ఢీ, ఉడిపిలో 8 మంది పిల్లల దుర్మణం, స్కూల్ బస్సుకు యాక్సిడెంట్ 8 మంది మృతి, కర్ణాటకలో ఘోర ప్రమాదం, 8 మంది చిన్నారుల మృతి, తెలుగు వార్తలు, కర్ణాటక వార్తలు, తాజా వార్తలు, latest news, udipi acident, 8 children died in UDIPI accident

As many as eight children, including six boys and two girls, were killed in a horrific accident on Tuesday morning at Trasi village, coming under Gangolli police station limits, Kumdapur taluk of Udupi district.

ఉడిపిలో ఘోర ప్రమాదం... 8 మంది చిన్నారుల మృతి

Posted: 06/21/2016 02:47 PM IST
8 children killed in horrific accident at udipi

స్కూల్ బస్సులు విద్యార్థులను మింగేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకోవటం మనం చూశాం. విద్యా సంవత్సరం ప్రారంభమైన సంతోషంతో బడివైపు పరుగులు తీస్తున్న విద్యార్థులకు స్కూల్ వాహనాలే యమశకటాలుగా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని ఉడిపిలో ఘోర ప్రమాదం సంభవించి 8 మంది చిన్నారులు మృతి చెందారు.

మంగళవారం ఉడిపి జిల్లాలోని మొహాడీ క్రాస్ వద్ద స్కూలు వ్యానును ఓ బస్సు ఢీకొనడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. బైండూరు నుంచి కుందాపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు  డాన్ బాస్కో స్కూలు ఓమ్ని వ్యాన్ ను ఢీకోట్టడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో ప్రాణాలు కోల్పోయారు. మరో పిల్లవాడు ఆస్పత్రిలో మరణించాడు.
ఘటనలో వ్యాన్ డ్రైవర్, ఒక టీచర్ సహా మరో 12 మంది గాయపడ్డారు.

గాయపడినవాళ్లలో కొందరికి స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా మిగిలినవారిని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ అన్నమలై ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బస్సులోని కొందరు ప్రయాణికులకు కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని తప్పు ఎవరిదని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఆ ప్రాంతమంతా తల్లిదండ్రులో రోదనలతో కలిచివేస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka  Udipi accident  8 children died  telugu news  

Other Articles