ఇన్ స్టాంట్ ఇళ్లులు వచ్చేస్తున్నాయోచ్... | Humanihut designed a portable houses in easy way

Humanihut designed a portable houses in easy way

new startup from Australia aims to give ‘shelter and dignity’, instant home for every one, home set up in five minutes, నిమిషాల్లో ఇళ్లు, ఐదు నిమిషాల్లో ఇళ్లు, మడతపెట్టే ఇళ్లు వచ్చేస్తున్నాయ్, మడతేసి మోసుకెళ్లే ఇళ్లు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, tealugu news, International news, carrying homes, Humanihut portable houses.

A new startup from Australia aims to give ‘shelter and dignity’ to everyone. The startup called Humanihut have designed a portable housing system that is not only inexpensive and easy to assemble but also provides ‘robust shelter and storage solution’. The Humanihut Shelter System can give the underprivileged, refugees or anyone affected by natural disaster ‘short, medium or long-term housing’ facilities.

ITEMVIDEOS: ఇన్ స్టాంట్ ఇళ్లులు వచ్చేస్తున్నాయోచ్...

Posted: 06/21/2016 12:36 PM IST
Humanihut designed a portable houses in easy way

ఒక ఇల్లు కట్టుకోవాలంటే సగటు మనిషికి తడిసి మోపడయి తలకు మించిన భారమవుతోంది. ఇసుక దగ్గర్నుంచి అన్నింటికీ జేబుకు చిల్లుపడాల్సిందే. పోనీ అంత చేసినా సకాలంలో ఇల్లు పూర్తవుతుందన్న నమ్మకం చాలా తక్కువ. అలాంటి వారి కోసం ఓ బంఫరాఫర్ ప్రకటించింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ. కేవలం నిమిషాల వ్యవధిలో నిర్మించుకునే మడతపెట్టే ఇళ్లను రూపొందించి అబ్బుర పరస్తోంది. అదేలాగో మీరు చూడండి.

ఆస్ట్రేలియాలోని హ్యూమనీహట్ సంస్థ సరికొత్త ఇళ్లను రూపొందించింది. కేవలం ఐదు నిమిషాల్లో ఇంటిని తయారు చేసి అందజేయనుంది. పిండికొద్దీ రొట్టె అన్నట్టు...మీరు పెట్టిన ఖర్చును అనుసరించే ఆ ఇంట్లో సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. ఇనుముతో నిర్మించే ప్రతి యూనిట్‌ 22 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు ఉంటుంది. యూనిట్‌ పైభాగంలో సోలార్‌ ప్యానళ్లను అమర్చడంతో గదికి కావాల్సిన విద్యుత్‌ లభిస్తుంది. ప్రతి యూనిట్‌లో వాటర్‌ ప్యూరిఫైయర్‌, నీటిని వేడి చేసే యంత్రాలను అమర్చారు. ఒక్కో యూనిట్‌ను అమర్చడానికి 5 నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. షిప్పింగ్‌ కంటైనర్‌లో ఇలాంటి ఇళ్లను 16 వరకూ తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.

తక్కువ ఖర్చుతో రూపొందించే ఈ ఇళ్లను స్వల్ప, దీర్ఘకాలిక అవసరాలకు వీటిని వినియోగించుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం వంటి సమయాల్లో బాగా అక్కరకు వస్తాయని రూపకర్తలు చెబుతున్నారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Humanihut startup  shelter and dignity  portable houses  

Other Articles