tollywood hero wife met with accident at pahadi shareef

Viranica manchu met with accident at pahadi shareef

tollywood hero manchu vishnu, manchu vishnu wife, Manchu Viranica, Manchu Viranica accident, Manchu Viranicat pahadi shareef, Manchu Viranica jalpally, manchu farm house, Manchu mohan babu,

Tollywood collection king and politician Mohan Babu daughter in law and manchu vishnu wife Viranica Manchu met with accident at pahadi shareef.

రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ ప్రముఖ హీరో భార్యకు గాయాలు..

Posted: 06/18/2016 02:27 PM IST
Viranica manchu met with accident at pahadi shareef

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా పేరొందిన ప్రముఖ నటుడు మోహన్ బాబు కోడలు, హీరో మంచు విష్ణువర్థన్ బాబు భార్య విరోనికాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో అమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్పల్లి వద్ద ఇవాళ సంభవించిన రోడ్డు ప్రమాదంలో విరోనికాతో పాటు మరొకరికి స్వల్పంగా గాయలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

క్షతగాత్రులైన విరోనిక సహా మరోకరిని వెంటనే చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి జల్పల్లి ఫాంహౌస్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వోల్వో ఎస్‌యూవీలో వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగిందని, అది సురక్షితమైన వాహనం కావడంతో కొద్దిపాటి గాయాలతోనే విరోనికా బయటపడ్డారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రమాద వార్త తెలియడంతో మంచు కుటుంబం షాక్ గురైంది. హుటాహుటిన అమె అరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంచు కుటంబసభ్యులు, వారి శ్రేయోభిలాషులు అపోలో అస్పత్రికి చేరకుంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu mohan babu  manchu vishnu  Manchu Viranica  accident  pahadi shareef  

Other Articles