paderu asp sasikumar death suicide attempt..? or mis fire..?

Paderu asp sasi kumar died under suspicious circumstances

sasikumar, paderu asp, suspicious death, suicide, misfire, service revolver, accidental fire, head injury, Salem, Tamil Nadu, Allagaddda

Paderu ASP Sasi Kumar died in a suspicious circumstances. It is yet to be confirmed whether the ASP has shot himself with his service revolver or accidentally got off.

పాడేరు యువ ఐపీఎస్ అనుమానాస్పద మృతి

Posted: 06/16/2016 09:38 AM IST
Paderu asp sasi kumar died under suspicious circumstances

విశాఖపట్నం జిల్లా పాడేరులో విషాదం అలుముకుంది. యువ ఐపీఎస్ అధికారి పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మరణించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదవశాత్తూ తన రివాల్వర్ పేలిందా లేక కావాలనే ఆయన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇవాళ తెల్లవారుజామున ఏఎస్పీ బంగ్లాలో కాల్పులు వినిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయన గదిలోకి చేరుకున్నారు.

అప్పటికే రక్తపు మడుగులో పడిన శశికుమార్ ను చూసిన సిబ్బంది ఆయన తలకు తీవ్ర గాయం కావటంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఏఎస్పీ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అవివాహితుడు అయిన శశికుమార్ ఆరు నెలల క్రితమే పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన ఆళ్లగడ్డ ఎఎస్సీగా విధులు నిర్వహించారు. ఆయన స్వస్థలం తమిళనాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.2012 బ్యాచ్ కు చెందిన యువ ఐఫీఎస్ ఉన్నతాధికారులు ఒత్తడి వల్ల, లేక ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా.? లేక నిజంగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మరణించారా..? అన్న వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి వుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles