Eighth groom kanakaraj wants to marry pavithra, the cheating bride

Woman marries 7 men duping one after another eighth groom wants to marry her

fake marriage, duping husbands, cheating, cheating woman, cheating lady, Pavithra,mariammal,malathi,angenlina, 7 times marriage, dowry, gold, property, Tamil Nadu

KK nagar Police were shocked, as a 43 year old business man wants to marry the cheating bride pavithra even after knowing that she married seven and duped one after other.She used to disappear with stolen money, gold and other valuable items after getting married to a person.

పవిత్రే కావాలంటున్న కనకరాజ్.. ఎన్ని కేసులైనా పర్వాలేదట..

Posted: 06/16/2016 10:29 AM IST
Woman marries 7 men duping one after another eighth groom wants to marry her

సులభంగా డబ్బును అర్జించేందుకు పవిత్రమైన ఏడు అడుగుల బంధాన్ని కూడా వాడుకుని ఏడుగురితో వివాహం చేసుకుని ఎనమిదో పెళ్లికి సిద్దమైన ఓ కిలాడి వన్నెలాడినే తాను పరిణయం అడుతానని భీష్మించాడు ఓ వ్యాపారి. ఏడుగురితో వివాహం చేసుకుని వారి నుంచి డబ్బు, నగలు, విలువైన ఆభరాలను తీసుకుని ఉడాయించిన మాయలాడి పవిత్రతోనే తన వివాహం జరపించాలని 43 ఏళ్ల స్థానిక వ్యాపారి, ఎనమిదో పెళ్లి కోడుకు కనకరాజ్ పట్టుబట్టడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇటీవలే పవిత్ర అలియాస్ మాలతితో ఉడుమలైపేటలో నిశ్చితార్థం కూడా జరిగడంతో అమెతోనే తన వివాహం జరిపించాలని పట్టుబడుతున్నాడట.

నిశ్చితార్థ సమయంలో పవిత్రకు ఖరీదైన పట్టుచీర, 20 సవర్ల నగలను పెళ్లి కానుకగా ఇచ్చిన కనకరాజ్ అమెపై మనసు పారేసుకున్నాడు, అమెపై ఎన్ని కేసులు వున్నా పర్వాలేదు.. అమెను తాను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడట. తనకు ఆమెతో పెళ్లి అయితే చాలు అని కూల్‌గా చెప్పాడు. ఆమెను తనతో పంపమని పోలీసులను బతిమాలాడు. దీంతో పోలీసులు ముందుగా అతన్ని సముదాయించినా అతను తన పట్టు వీడకపోవంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని హెచ్చరించారు.

పవిత్ర ఎలా పట్టుబడింది..?

ఒకరి తరువాత ఒకరిని పెళ్లి చేసుకుని డబ్బు నగలు, నగదు, విలువైన వస్తువులతో ఉడాయించే పవిత్ర ఇప్పటికే ఏడుగురిని పెళ్లి చేసుకుంది. కాగా తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన సెల్వకుమార్ (పవిత్ర ఏడో భర్త) తన భార్య పవిత్ర (32) గత నెల 27 నుంచి  కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పవిత్రను ఉడుమలైలో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బ్రోకర్ల సాయంతో ఆమె ఏడుగురిని వివాహం చేసుకుని వారితో కొన్ని రోజులు గడిపి నగలు, నగదు దోచుకుని పారిపోయేదని తెలిసింది.

బ్రోకర్లు పెళ్లి కొడుకుల వద్ద పవిత్రకు తల్లిదండ్రులు లేదని ఆమెను పెంచుకున్న వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పేవారు. లేటు వయస్సులో అమ్మాయిలు దోరక్క ఇబ్బందిపడే పెళ్లి కొడుకులు బ్రోకర్ల కండీషన్లకు తలొగ్గి  పవిత్రను పరిణయమాడారు. వారితో కొన్న రోజులు కాపురం చేసి.. అదను చూసి నగలు, నగదు విలువైన వస్తువులతో అక్కడి నుంచి ఉడాయించేది. కాగా పవిత్ర మోసానికి మొదటి భర్త సహకరించేవాడని తెలిసింది. దీంతో అతడ్ని కూడా అదుపులోకి తీసుకని పోలీసులు విచారించారు.

ఇలా సేకరించిన మొత్తంలో పవిత్ర బ్రోకర్లకు కొంత మొత్తం ముట్టజెప్పేదని.. దీనికి ఆశపడిన బ్రోకర్లు పెళ్లికొడుకుల కోసం గాలించేవారని తెలుస్తోంది. కొంతమంది బ్రోకర్లు పెళ్లి కొడుకుల జాతకాలకు తగినట్లు పవిత్ర జాతకాన్ని తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే మోసపోయిన వారు ఎవరూ ఆమెపై ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఏడో భర్త సెల్వకుమార్ వద్ద చోరీ చేసిన నగలు, నగదును అతనికి ఇప్పించి పవిత్రను హెచ్చరించి వదిలేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheating woman  husbands  marriages  kk nagar  pavithra  chennai  tamilnadu  

Other Articles