Gunman shot and killed in hostage situation at Amarillo, TX Walmart

Armed worker took hostages fatally shot at wal mart

Police, Amarillo, Texas State, Wal-Mart Mall, Mohammad Moghaddam, employee, workplace violence, Brent Barbee, Brian Nick, Randall County Sheriff's

An armed man suspected of firing shots at an Amarillo Walmart has been shot and is dead, according to the Amarillo Police Department.

అమెరికా టెక్సాస్ వాల్మార్ట్ లో కాల్పుల మోత..

Posted: 06/15/2016 09:44 AM IST
Armed worker took hostages fatally shot at wal mart

అమెరికా మళ్లీ కాల్పుల కలకలం రేకెత్తింది. ఆర్లెండో నైట్ క్లబ్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 49 మంది మృతిచెందిన భయానక ఘటనను మరువక ముందే టెక్సాస్‌ రాష్ట్రం అమరిల్లోలోని ఓ వాల్‌మార్ట్ మాల్‌లో మరో సాయుధుడు చోరబడ్డారన్న సమాచారంతో ఉగ్ర కలకలం రేగింది. రెండుగంటలపాటు శ్రమించిన అమరిల్లో పోలీసులు మాల్‌లో ఓ వ్యక్తిని బందీగా చేసుకున్న ఆగంతకుడిని కాల్చిచంపారు. అయితు సదరు సాయుధుడిని సోమాలియాకు చెందిన వ్యక్తిగా అమరిల్లో పోలీసులు గుర్తించారు.

కాగా సాయుధుడికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని ఉగ్రదాడి కాదని ప్రాథమికంగా అమరిల్లో పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే పదోన్నతుల విషయంలో తనకు అన్యాయం జరిగిందన్న అక్కస్సుతోనే మృతుడు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అమరిల్లో పోలీసులు చెప్పారు. పనిచేసే చోట ఇద్దరు మధ్య నెలకొన్న ఘర్షణే ఈ ఘటనకు కారణమన్నారు. మృతుడు 54 ఏళ్ల వాల్ మార్ట్ ఉద్యోగి మహమ్మద్ మాగ్హదమ్గా గుర్తించారు. పదోన్నత విషయంలో తనకు అన్యాయం జరిగిందని భావించిన నిందితులు వాల్ మార్ట్ మేనేజర్ తో పాటు మరో వ్యక్తి బంధీలుగా చేసుకున్నాడని అన్నారు,

అంతకుముందు, వాల్ మార్ట్ మాలోకి ఇద్దరు సాయుధులు చొచ్చుకెళ్లారనే వార్తలు కలకలం రేపాయి. మాల్‌లో కొందరిని వీరిద్దరు బందీలుగా చేసుకున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు మాల్ చుట్టుపక్కల ఇళ్లను ముందుజాగ్రత్తగా ఖాళీ చేయించారు. కాసేపటి తర్వాత లోపలకు ప్రవేశించిన పోలీసులు వెనుకద్వారం గుండా మాల్‌లో ఉన్నవారిని బయటకు పంపించారు. తర్వాత ఓ గదిలో ఓ వ్యక్తిని బందీని చేసుకున్న ఆగంతకుడిని మట్టుబెట్టి.. బంధీలను విముక్తి కల్పించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles