Kiss Of Death: 20-Year-Old Woman Dies After Kissing Boyfriend Goodnight

Man gives girlfriend tragic kiss of death

Woman Died After Kissing Boyfriend, Peanut Allergy Death, Peanut Allergy Death Kiss, Kiss Of Death, Myriam Ducré-Lemay,

A late night kiss from her boyfriend turned out fatal for a Quebec woman who has severe peanut allergy.

ముద్దుతో చంపేశాడు.. ప్రియురాలికి లిప్ లాక్ పెట్టి..

Posted: 06/15/2016 08:36 AM IST
Man gives girlfriend tragic kiss of death

నందమూరి నట సింహం బాలయ్య చెప్పిన డైలాగ్ గుర్తుందా..? కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా..? ఈ డైలాగ్ వచ్చిన తరువాత దీనికి అనేక పేరడీ డైలాగులు కూడా వచ్చాయి. ఈ డైలాగులను ఎక్కడైనా విన్నాడో ఏమో తెలియదు కానీ ఇంగ్లాండ్ కు చెందిన ఓ యువకుడు అతని గర్లఫ్రెండ్ తో కూడా ఇలాంటి పేరడి డైలాగ్ చెప్పేశాడు. అంతేకాదు చెప్పినట్లే చేసేశాడు. అదేంటి కంటిచూపుతో ప్రాణాలను తీశాడా అన్నేగా మీ డౌట్..? అవునండీ భలేగా గెస్ చేసేశారు.

రోమాంటిక్ లవర్ బాయ్ కదా అందుకనే తన గర్లఫ్రెండ్ తో పేరడీ డైలాగ్ చెప్పాశాడు. అదేంటంటారా..? కత్తులతో కాదు.. ముద్దుతో చంపుతా..? అని.. అన్నడమే కాదు.. బాయ్ ప్రెండ్ ముద్దు పెట్టగానే అతని గర్ల్ ప్రెండ్ అమాంతం ప్రాణాలను వదిలేసింది. ఇంగ్లండ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే...మరియమ్ లిమే (20) తన బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు ఓ హోటల్ కు వెళ్లింది. అతనితో మాట్లాడి వెనక్కి వచ్చేముందు ప్రియుడు ఆమెకు ముద్దుపెట్టి మరీ పంపించాడు. తరువాత కాసేపటికి ఆస్తమాతో బాధపడిన మరియమ్ కు ఊపిరి ఆడనట్టు అనిపించడంతో గిజగిజలాడిపోయింది.

ఊపిరి తీసుకునేందుకు తీవ్రంగా కష్టపడి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు పోస్టు మార్టం చేసిన వైద్యులు బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ముద్దే ఆమె ప్రాణాలు హరించిందని తేల్చారు. మరియమ్ ను ముద్దుపెట్టుకునే ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ పీనట్ (వేరు శనగ) బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిన్నాడు. అయితే, ఆస్తమాతో బాధపడేవారికి పీనట్ అలర్జీ... అది కొద్దిగా తిన్నా ప్రాణాలకే ప్రమాదం. దానిని తిన్న బాయ్ ఫ్రెండ్ ఆమెకు అధర చుంబనంతో ప్రేమను రుచి చూపించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తేల్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  boy friend  asthama  kiss o fdeath  England  peanut allergy  

Other Articles