Indiana man arrested in California with guns, chemicals

Man with weapons was headed to la gay pride parade

Orlando Shooting, California, Gay Parade, Omar Mateen, Afghan, Santa Monica , Orlando shooting: Weapons, ammunition found in car ahead of LA gay pride parade, world news

An Indiana man armed with three assault rifles and chemicals used to make explosives was arrested in Southern California

పోలీసుల అదుపులో మరో సాయుధుడు.. తప్పిన ప్రమాదం

Posted: 06/13/2016 03:10 PM IST
Man with weapons was headed to la gay pride parade

అమెరికా ఇంతకుమునుపెన్నడూ చూడాని అత్యంత దారుణ మారణకాండను చవిచూసి క్రమంలో మరో పెను ప్రమాదం తప్పిందని తెలియడంలో అగ్రరాజ్యవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థకు చెందిన టెరరిస్టు ఒర్లాండోలోని నైట్ క్లబ్ లో నరమేథం సృష్టించడం.. ఆ తరువాత మరో సాయుధుడైన అగంతకుడు పోలీసుల అదుపులో చిక్కాడన్న వార్తలతో అమెరికన్లు బిక్కు బిక్కుమంటూ జీవనాన్ని గడుపుతున్నారు. గెండెల నిండా నిండిన ధైర్యంతో వున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఆర్లెండో నైట్ క్లబ్ లో నరమేధం జరిగిన కొద్ది గంటల్లోనే దక్షిణ కాలిఫోర్నియాలో మరో సాయుధుడిని పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు అగంతకుడు వెస్ట్ హోలాండ్ లో గే పరేడ్ జరుగుతున్న వైపు వెళ్లడాన్ని గమనించారు. అనుమానంతో అతన్ని శాంటా మోనికాలో అతడి అపిన పోలీసులు తనిఖీలు చేశారు. అగంతకుడి వద్ద నుంచి మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అగంతకుడిని జేఫర్సన్ విల్లేకు చెందిన జేమ్స్ వెస్లే హొవెల్(20)గా గుర్తించారు.

ఆర్లెండో నైట్ క్లబ్ దాడితో అతడికి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. వెస్ట్ హోలాండ్ లో స్వలింగ సంపర్కుల ర్యాలీలో హింసకు పాల్పడేందుకే వెళుతున్నట్టు హొవెల్ చెప్పాడని శాంటా మోనికా పోలీస్ చీఫ్ జాక్వెలైన్ సీబ్రూక్స్ ట్వీట్ చేశారు. తర్వాత ఆమె తన ప్రకటనను సరి చేసుకున్నారు. పరేడ్ కు వెళుతున్నానని మాత్రమే అతడు చెప్పాడని తెలిపారు. హొవెల్ వెనుక ఎవరున్నారనే దానిపై ఎఫ్ బీఐ దర్యాప్త్ చేస్తోంది. అతడి ఫేస్బుక్ పోస్టింగులను పరిశీలించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gun man  Santa Monica  Jeffersonville  Southern California  crime  

Other Articles