India vs Zimbabwe 2nd ODI: Zimbabwe set 127-run target for India

Zimbabwe crumble to 126 after sibanda fifty

India vs Zimbabwe live score, Zimbabwe live score, India live score, India vs Zimbabwe scorecard, India vs Zimbabwe live scorecard, live cricket score, live match score, IND vs ZIM, IND vs ZIM live score, Zimbabwe vs India 2016

Poor shot selection sent Zimbabwe tumbling to 126 all out, after India sent them in for the second time in two matches at the Harare Sports Club.

భారత బౌలర్ల ముందు బెంబేలెత్తిన జింబాబ్వే..

Posted: 06/13/2016 03:42 PM IST
Zimbabwe crumble to 126 after sibanda fifty

మూడు వన్డేల సిరీస్ల భాగంగా సోమవారం హరారే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. అదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. అక్కడి నుంచి పటిష్టంగా కనిపించిన జింబాబ్వే జట్టును చాహల్ దెబ్బతీసాడు. వరుసగా రెండు వికెట్లు తీయడంతో పాటు స్కోరుబోర్డును వేగంగా కదిలిస్తున్న సిబందాను కూడా ఔట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపుతిరిగింది. ఆ తరువాత బమ్రా, స్కాన్, కులకర్ణీలు మిగిలిన కార్యాన్ని పూర్తి చేశారు. దీంతో జింబాబ్వే కేవలం 34.3 ఓవర్లలోనే 126 పరుగులకు అలౌట్ అయ్యింది.

127 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా ముందు నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆదిలోనే మసకద్జా(9) నిరాశపరచగా, ఆపై మూర్(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగులకే జింబాబ్వే రెండు వికెట్లను నష్టపోయింది. కాగా, చిబాబా(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సిబందా(53) ఆకట్టుకున్నాడు. సిబందా-సికిందర్ రాజా(16)ల జోడి నాల్గో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.

ఆ తరువాత జింబాబ్వే వరుసగా క్యూకట్టడంతో 34.3 ఓవర్లలో  126 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఆదిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తరువాత చతికిలబడింది.  25.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసిన జింబాబ్వే.. మరో 10 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో చాహల్ మూడు వికెట్లు సాధించగా, బరిందర్ శ్రవణ్, కులకర్ణిలకు తలో రెండు వికెట్లు దక్కాయి.తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbabwe  second one day  harare  cricket  

Other Articles