Gunman who killed 50 in Orlando nightclub had pledged allegiance to ISIS

Orlando shooting 50 killed shooter pledged isis allegiance

orlando, shooting, night club, police, terrorism, FBI, gay, isis, omar matin, siddiqui, afghanistan, orlando massacre, barrack obama

A gunman who pledged allegiance to the Islamic State opened fire inside a crowded gay bar and dance club, leaving 50 people dead and 53 injured in the deadliest mass shooting in U.S. history

నైట్ క్లబ్‌లో నరమేధం.. తమ చర్యగా ప్రకటించుకునన్న ఐఎస్ఐఎస్

Posted: 06/13/2016 07:54 AM IST
Orlando shooting 50 killed shooter pledged isis allegiance

అమెరికాలోని ఫ్లోరిడా నగరంలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో నరమేధం సృష్టించింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. ఈ మేరకు ఐఎస్ వార్తా సంస్థ ‘‘అమక్’... ఓర్లాండోలో బీభత్సం సృష్టించిన దుండగుడు ఐఎస్ కు చెందిన ఫైటరేనని ప్రకటించింది. దాడి జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగినా... సదరు దుండగుడికి ఉగ్రవాద లింకులున్నాయన్న విషయాన్ని వెల్లడించలేదు. దాడి వెనుక ఉగ్రవాద కోణం కనిపిస్తున్నా.. దుండగుడిని ఐఎస్ ఉగ్రవాదిగా గుర్తించలేకపోయారు. అయితే దుండగుడి వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాత అతడు ఐఎస్ ఉగ్రవాదేనని తేలింది.

విచక్షణారహితంగా కాల్పులకు దిగి 50 మందిని పొట్టనబెట్టుకున్న ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు ఒమర్ మతీన్ గా గుర్తించారు. మతీన్ ఫ్లోరిడాకు చెందిన యువకుడే. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చి ఫ్లోరిడాలో స్థిరపడ్డ దంపతులకు అతడు జన్మించాడు. అమెరికాలో ఉంటూనే అతడు ఐఎస్ వైపు ఆకర్షితుడయ్యాడు. గతంలో ఓ మారు అతడిని ఎఫ్ బీఐ అధికారులు ప్రశ్నించారట. ఆత్మాహుతి దళ సభ్యుడితో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అతడిని ప్రశ్నించినట్లు నిన్న ఎఫ్ బీఐ అధికారులు పేర్కొన్నారు.

తన కుమారుడు ఇంతటి దారుణం చేస్తాడని ఊహించలేదని, అమెరికా అంతటినీ దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై, జాతి మొత్తానికి తాము క్షమాపణలు చెబుతున్నామని ఓమర్ మతీన్ తండ్రి, అఫ్ఘనిస్తాన్ నుంచి వలసవచ్చి అమెరికాలో స్థిరపడిన మీర్ సిద్దిఖీ అన్నాడు. గత నెలలో మియామీలో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకోవడం చూసిన తన కుమారుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని, అతని వ్యతిరేకతను మతపరమైన అంశంగా చూడవద్దని కోరాడు.

అమెరికాలో గత వందేళ్లకు పైగా చవిచూడని నరేమేధం ఫ్లోరిడా రాష్ట్రం.. ఆర్లెండో నగరంలో గే (స్వలింగ సంపర్కులు)ల కోసం వెలిసిన పల్స్ నైట్ క్లబ్ జరిగింది. సాయుధుడైన ఓ ఉన్మాది వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న క్లబ్ రక్తసిక్తమైంది. ఉన్మాది కాల్పుల్లో 50 మందికిపైగా చనిపోయారు. మరో 53 మంది గాయపడ్డారు. కాల్పుల విషయం తెలియగానే క్లబ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఉన్మాదిని మట్టుబెట్టారు. క్లబ్ నుంచి 30 మంది బందీలను రక్షించారు. ఈ దారుణఘటనపై స్పందించిన అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా దీనిని ఉగ్రవాద చర్యేనని ప్రకటించారు.

కాల్పుల విషయం తెలియగానే పోలీసులు క్లబ్‌ను చుట్టుముట్టినా.. ఐదు గంటల వరకూ లోపలకు వెళ్లలేకపోయారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో పాటు స్వాట్(స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీం) బృందాల్ని రప్పించారు. ఉన్మాదిని మట్టుపెట్టేందుకు ముందుగా క్లబ్ పరిసరాల్ని పూర్తిగా ఖాళీ చేయించారు. బందీల్ని విడిపించేందుకు ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. పేలుడు పదార్థాలతో గోడను పేల్చేసి అత్యాధునిక వాహనం ‘బేర్‌క్యాట్’తో స్వాట్ బృందాలు క్లబ్‌లోకి ప్రవేశించాయి. ఉన్మాదిని  మట్టుబెట్టి దాదాపు 30 మందికి విముక్తి కల్పించాయి. గాయపడ్డవారిని ఆర్లెండో రీజినల్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : orlando  shooting  night club  police  terrorism  FBI  gay  isis  omar matin  siddiqui  afghanistan  orlando massacre  barrack obama  

Other Articles