Muhammad Ali funeral: Rousing farewell at Louisville memorial

Muhammad ali laid to rest as world pays tributes

muhammad ali, muhammad ali dead, muhammad ali funeral, muhammad ali burial, muhammad ali muslim, muhammad ali converted, honoring muhammad ali, will smith, barack obama

Rousing tributes have been paid to boxing legend Muhammad Ali at a memorial service in his home city of Louisville, Kentucky.

ఘనంగా ముగిసిన మహమ్మద్ అలీ అంత్యక్రియలు

Posted: 06/11/2016 08:51 AM IST
Muhammad ali laid to rest as world pays tributes

వేలాది మంది అశ్రునయనాల మధ్య విశ్వవిఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సొంత నగరం లూయిస్‌విల్లే వీధుల గుండా సాగిన ఆయన అంతిమయాత్రను చివరిసారిగా తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. మహిళలు, వృద్ధులే కాకుండా యువకులతో పాటు చిన్నారులు కూడా ఓపిగ్గా నిరీక్షించారు. ‘అలీ వియ్ లవ్ యూ..’ అనే ప్లకార్డులతో మహాయోధుడికి చివరిసారిగా వీడ్కోలు పలికారు. సీతాకోక చిలుకలా విహరించు.. అనే తన నినాదానికి అనుగుణంగా కాన్వాయ్‌లోని వాహనాలకు బటర్‌ఫ్లయ్ గుర్తులను ఉంచారు.

17 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో 19 మైళ్ల పాటు యాత్ర సాగింది. 1960లో ఒలింపిక్ స్వర్ణం సాధించిన అనంతరం అలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన చివరి యాత్రను కూడా సాగించారు. బాల్యంలో నివసించిన ఇల్లు, తొలిసారిగా బాక్సింగ్ లో ఓనమాలు నేర్చుకున్న జిమ్, మొహమ్మద్ అలీ సెంటర్,  ఆఫ్రికన్ అమెరికన్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ దారిలో ఉన్నాయి. అలాగే అలీ శవపేటికను ఉంచిన వాహనం మీదికి అభిమానులు గులాబీ పూలను చల్లుతూ శ్రద్ధాంజలి ఘటించారు.

దశాబ్దం క్రితమే తన చివరి క్రియల కోసం ఎంపిక చేసుకున్న కేవ్ హిల్ శ్మశానవాటికలోనే అలీ అంత్యక్రియలు జరిగాయి. ఇందులో ప్రస్తుత భార్యతో పాటు ఆయన ఇద్దరు మాజీ భార్యలు, పిల్లలు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, మాజీ హెవీవెయిట్ చాంపియన్లు లెనాక్స్ లూయిస్, మైక్ టైసన్ కూడా తమ ఆరాధ్య దైవానికి చివరిసారిగా వీడ్కోలు పలికారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boxer Mohammad Ali  Funeral  Cave Hill cemetery  

Other Articles