Kapu leaders call fot AP bandh over mudragada pabmanabham

Mudragada pabmanabham hunger strike on straight third day

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Kapu caste leader Mudragada padmanbham continues hunger strike on straight third day in hospital at rajamundry, kapu leaders gives call for AP bandh

మూడో రోజుకు ముద్రగడ దీక్ష.. ఏపీ బంద్ కు కాపు నేతలు పిలుపు

Posted: 06/11/2016 07:14 AM IST
Mudragada pabmanabham hunger strike on straight third day

కాపు కులస్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, ఎన్నికల ముందు దోసెడు హామీలను గుప్పించిన టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత కనీసం గుప్పెడు హామీలను కూడా నేరవేర్చకపోవడాన్ని నిరిసిస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను ఇవాళ్టితో మూడో రోజుకు చేరుకుంది. రాజమండ్రి అస్పత్రిలో ఆయన తన సతీమణి పద్మావతితో పాటు అమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. ముద్రగడ అరెస్టును నిరసిస్తూ కాపు సామాజిక సంఘం నేతల పిలుపు మేరకు ఇవాళ ఆంద్రప్రదేశ్ బంద్ కొనసాగుతుంది.

దీక్ష విరమించి వైద్యం పొందడానికి సహకరించాలని పలు దఫాలుగా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లు నెరవేర్చే దాకా దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. ఒకానొక దశలో అధికారులు బలవంతంగా ఆయనకు ప్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ప్రతిఘటించారు. తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని, తలను గోడకేసి కొట్టుకుంటానని హెచ్చరించారు. ఆ మాటలు వినకుండా దగ్గరకు వస్తుండగా పక్కనే ఉన్న గోడకు తల కొట్టుకోవడంతో తలకు స్పల్ప గాయమైంది. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదన్న ఆరోపణలున్నాయి. హెల్త్ బులెటిన్లేవీ అధికారికంగా విడుదల చేయకపోవడంతో ముద్రగడ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, కాపు గర్జన సందర్భంగా జరిగిన తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగం పెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ నెల 8 వరకు  ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించారు. చంద్రబాబు సర్కారు స్పందిచకపోవడంతో ఆయన దీక్షకు దిగారు. ఇదిలా వుండగా పోలీసులు ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కోట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. కాపు సామాజిక సంఘం నేతలు ఇచ్చిన తూగో జిల్లా బంద్ సక్సెస్ కావడంతో ఇవాళ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  hunger strike  hospital  

Other Articles